young hero raj tarun to tie knot soon ప్రేమ పెళ్లికి యువ హీరో రెడీ అవుతున్నాడోచ్..!

Young hero raj tarun to tie knot soon to his love

Raj Tarun news, Raj Tarun movies, Raj Tarun latest pics, Very Soon Raj Tarun replies about his marriage, Raj Tarun, Idhari lokam okatey, marriage, love marriage, idhari lokam okatey, shalini pandey, dil raju, GR Krishna, movies, entertainment, tollywood

Tollywood Young Hero Raj Tarun replies that to a Fan question on his marriage, during chitchat in social media "Very Soon". Raj Tarun is an Indian actor who is also known as Rajam Tharun made his debut in the Tollywood movie Uyyala Jampala in 2013.

ప్రేమ పెళ్లికి యువ హీరో రాజ్ తరుణ్ రెడీ అవుతున్నాడోచ్..!

Posted: 05/28/2019 05:16 PM IST
Young hero raj tarun to tie knot soon to his love

త్వరలో తన పెళ్లి జరగనుందని యంగ్ హీరో రాజ్ తరుణ్ చెప్పాడు.. రీసెంట్‌గా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా చేసిన చిట్ చాట్‌లో రాజ్ తరుణ్, ఫ్యాన్స్‌తో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. తన తల్లి గురించి అడిగితే, దేవత అని, ప్రపంచంలో బాగా ఇష్టమైన వ్యక్తి తన తండ్రి అని, ఇష్టమైన వంటకం చింతపండు పులిహోర అని చెప్పిన రాజ్ తరుణ్, త్వరలోనే పెళ్ళి కబురు చెబుతానని, తనది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు.

ఇష్టమైన నటులు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, హిందీలో అమీర్ ఖాన్ అని చెప్పాడు. తమిళ్‌లో ఎప్పటికీ రజినీ కాంత్ గారే నా ఫేవరెట్ అని అన్నాడు. పూరీ జగన్నాథ్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని, భవిష్యత్తులో తను కూడా డైరెక్టర్ అవుతానని, తన దగ్గర ఇది వరకు 20 కుక్కలున్నాయని, ఇప్పుడవి 23కి చేరాయనీ అన్నాడు.

మీ సినిమాల్లో హీరోయిన్లుగా తెలుగమ్మాయిలను ఎందుకు తీసుకోరు అనడిగితే, అది దర్శక, నిర్మాతల చేతుల్లో ఉంటుందని చెప్పాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తుండగా, జి.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raj tarun  marriage  love marriage  idhari lokam okatey  shalini pandey  dil raju  GR Krishna  tollywood  

Other Articles