‘ఆర్ ఎక్స్ 100’ ఊహించని ఘన విజయం సాధించిన తరువాత ఆమూవీలో నటించిన పాయల్ రాజ్ పుత్ కు తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. టాప్ యంగ్ హీరోల నుండి క్రేజీ ఆఫర్లు వస్తాయని చాలామంది భావించారు. అయితే ఆమెకు టాప్ యంగ్ హీరోల నుండి కాకుండా టాప్ సీనియర్ హీరోల నుండి వరసపెట్టి అవకాశాలు వస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈమె రవితేజాతో ‘డిస్కోరాజ’ వెంకటేష్ తో ‘వెంకీ మామ’ సినిమాలలో నటిస్తోంది.
అయితేనేం అనుకుంటున్న పాయల్.. సీనియర్ హీరోల పక్కన నటిస్తున్నందుకు పారితోషకం బాగానే డిమాండ్ చేస్తోందని వార్తలు గుప్పమంటున్నాయి, ఇక తాజాగా అమె మరో సీనియర్ హీరో పక్కన కూడా ఛాన్స్ కోట్టేసింది. బాలకృష్ణ తదుపరి చిత్రంలో పాయల్ రోమాన్స్ చేయబోతుందన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈనెల ప్రారంభం కాబోతున్న బాలకృష్ణ కెఎస్ రవికుమార్ ల మూవీ ప్రాజెక్ట్ లో పాయల్ హీరోయిన్ గా నటించడానికి తన అంగీకారం చెప్పింది. అయితే ఈ సినిమాలో నటించడానికి ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
చాలాకాలం తరువాత బాలయ్య మళ్ళీ పోలీసు డ్రెస్ వేసుకుంటున్న ఈమూవీ బాలయ్యకు బాగా అచ్చివచ్చిన రాయలసీమ నేపధ్యంలో ఉంటుంది అని టాక్. ‘రూలర్’ పేరుతో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో పాయల్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించడమే కాకుండా బాలయ్యతో ఈమె చేయబోయే రొమాంటిక్ సీన్స్ ఈమూవీకి హైలెట్ గా మారుతాయి అని అంటున్నారు. ఈమూవీ ప్రారంభించిన వెంటనే వేగంగా ఆరు నెలలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో బాలయ్యకు అచ్చొచ్చే సంక్రాంతి రోజున విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతల ప్లాన్ అని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more