Rajasekhar packs a punch in Kalki teaser రాజశేఖర్ ఇమిటేషన్ కామెడీతో యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’..

Kalki trailer rajasekhar steals the limelight with his action packed moves

Adah Sharma, ashutosh rana, C. Kalyan, Charandeep, DS Rao, Happy Movies, kalki, Nandita Swetha, Nasser, Poojitha Ponnada, Rahul Ramakrishna, Rajasekhar, Satis, Scarlett Wilson, Shatru, Shivani Rajasekhar, Shivathmika Rajasekhar, Siddhu Jonnalagadda, Vennela Rama Rao, Venugopal, tollywood, movies, entertainment

Rajasekhar’s fans have been waiting with bated breath to get more and more updates on his upcoming film Kalki.

రాజశేఖర్ ఇమిటేషన్ కామెడీతో యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’..

Posted: 05/09/2019 10:32 PM IST
Kalki trailer rajasekhar steals the limelight with his action packed moves

గ‌రుడ‌వేగ సినిమాతో తానింకా ఫాంలోనే ఉన్నాన‌ని నిరూపించుకున్న రాజశేఖర్ ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. తన తదుపరి చిత్రం కూడా హిట్ కావాలని ఆశించే ప్రయత్నంలో తనను తాను ఇమిటేట్ చేసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. రాజశేఖర్ నటిస్తున్న కల్కి చిత్రం సినిమా క‌మ‌ర్షియ‌ల్ ట్రైల‌ర్ ఇవాళజు విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. మొదటి టీజర్ మామూలుగానే కట్ చేసిన డైరెక్టర్ ఈ టీజర్ లో మాత్రం కామెడీని ఫోకస్ చేశారు. టీజర్ లో ఉన్న ఏం సేస్తిరి సేస్తిరి అనే డైలాగ్ రాజ‌శేఖ‌ర్ ఇమిటేష‌న్ సీన్ ట్రైల‌ర్‌లో హైలైట్ అయ్యాయి.

ఆ లాంటి ప్రయోగాత్మక సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ‘క‌ల్కి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. అదాశ‌ర్మ‌, నందిత శ్వేత ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే క‌ల్కి సినిమా విడుద‌ల కానుంది. ఈ టీజర్ పార్థా అంటూ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత శ్లోకంతో ప్రారంభమవూతుంది.

‘‘పార్థా.. కర్మలను అచరించటయందే నీకు అధికారముకలదు కానీ.. వాని ఫలితము పైన లేదు.. నీవు కర్మ ఫలితమునకు కారణం కారాదు.. అట్లని కర్మలను చేయుట మానరాదు’’ ఈ శ్లోకం ముగియగానే.. ఆయన పాత చిత్రాల్లో చెప్పిన ఏం సెప్తిరి, ఎం సెప్తిరి ఎప్పుడు ఇలాగే సెప్తారా.. అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ట్రైయిలర్ చివరిలో రాజశేఖర్ మార్కుగా రెండు చేతులతో పాటు శరీరాన్ని కూడా ఊపడం తనను తాను ఇమిటేట్ చేసినట్లుగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalki  Rajasekhar  Adah Sharma  Nandita Swetha  Nasser  Poojitha Ponnada  tollywood  

Other Articles