Maharshi Trailer : Three Shades of Rishi ! ప్రపంచాన్ని ఏలేద్దామద్దామని వస్తున్న ‘మహర్షి’.. ట్రైయిలర్

Maharshi trailer mahesh babu film is a perfect treat for his fans

maharshi, maharshi trailer, mahesh babu, maharshi trailer launch, mahesh babu maharshi, maharshi film, maharshi release, mahesh babu movie maharshi, maharshi movie trailer, mahesh babu, maharshi, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Dil Raju, tollywood, movies, entertainment

Tollywood Prince Mahesh Babu is back on the screens as Rishi in Maharshi. The trailer shows Mahesh Babu as a man who has a habit of winning. He wants to rule the world and he declares the same at the beginning of the trailer.

ప్రపంచాన్ని ఏలేద్దామని వస్తున్న ‘మహర్షి’.. ట్రైయిలర్.

Posted: 05/01/2019 08:14 PM IST
Maharshi trailer mahesh babu film is a perfect treat for his fans

‘ఓడిపోతాం అనే భయంతో ఆటలోకి దిగితే.. ఎప్పటికీ గెలవలేం’ అంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహేష్ కెరియర్ 25 మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తున్నారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (మే 1) హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు.. విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, వంశీ పైడిపల్లి, అశ్వనీదత్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ చేతుల మీదుగా ‘మహర్షి’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘ఏలేద్దాం అనుకుంటున్నా సార్!! ప్రపంచాన్ని ఏలేద్దాం.. అనుకుంటున్నా సార్.., ఓడిపోతాం అనే భయంతో ఆటలోకి దిగితే.. ఎప్పటికీ గెలవలేం’ అంటూ మహేష్ బాబు మహర్షి ట్రైలర్ లో చెప్తున్న ఈ డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేవిగా ఉన్నాయి. స్టూడెంట్ గా, బిజినెస్ మ్యాన్ గా, రైతుగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేస్తున్నాడు మహేష్. ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వుంటుందని ట్రైయిలర్ చాటిచెబుతోంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  maharshi  Pooja Hegde  Allari Naresh  Vamshi Paidipally  DSP  Dil Raju  tollywood  

Other Articles