'F2' hits 50 in 106 centres! ఎఫ్ 2 అర్థశతదినోత్సవం.. 106 కేంద్రాల్లో..!

Sankranthi blockbuster f2 completes 50 days mark

F2, Anil Ravipudi, Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen, Devi Sri Prasad, Dil Raju, F2 news, F2 updates, F2 latest, F2 collections, F2 success meet, F2 50 days

Sankranthi blockbuster F2 completes 50 Days mark: F2 has been named as the first hit of this year and it completed 50 days recently.

ఎఫ్ 2 అర్థశతదినోత్సవం.. 106 కేంద్రాల్లో..!

Posted: 03/02/2019 07:00 PM IST
Sankranthi blockbuster f2 completes 50 days mark

ఈ సంక్రాంతి లేటుగా బరిలో దిగినా..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘F2’  సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో అరాచకమే సృష్టించింది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ ‘పేట’ సినిమాలు సోదిలో లేకుండా పోయాయి. మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఎక్కడ ఈ సినిమా కలెక్షన్స్ తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా ఈ  సినిమా ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 106  సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్నట్టు ఈ  సినిమా నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ట్రేడ్ వర్గాల ప్రకారం డైరెక్ట్‌గా ఈసినిమా 65 సెంటర్స్‌లో 50 రోజులు ఈ రోజుతో పూర్తి చేసుకోనుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రూ.83 కోట్ల షేర్..140 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు సమాచారం.

రీసెంట్‌ టైమ్‌లో పెద్ద సినిమాలకు మాత్రమే సాధ్యమైన కలెక్షన్స్‌ను ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. మొత్తంగా 2019లో మంచి శుభారంబాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు నితిన్ మరో హీరోగా నటిస్తున్నాడు.  తొందర్లోనే ఈసినిమా సెట్స్‌  పైకి వెళ్లే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : F2  Anil Ravipudi  venkatesh  varun tej  DSP  tollywood  

Other Articles