Renu Desai’s Movie on Farmers కథ కోసం క్షేత్రస్థాయిలో రేణుదేశాయ్ పర్యటన

Renu desai visits kurnool to meet families of deceased farmers

Renu Desai, renu desai farmers, renu desai kurnool, renu desai director, renu desai deceased farmer families, renu desai aluru, renu desai thumbalabeedu, movies, entertainment, tollywood

Renu Desai has been juggling from Pune and Hyderabad on work. She is trying to set her base in Hyderabad and test her luck with different kinds of assignments. She is all set to host a new show on TV that revolves around farmers and the problems they face.

కథ కోసం క్షేత్రస్థాయిలో రేణుదేశాయ్ పర్యటన

Posted: 02/25/2019 01:38 PM IST
Renu desai visits kurnool to meet families of deceased farmers

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన కథాంశంగా సినిమాను రూపోందించే బాధ్యతను తలపై పెట్టుకున్న నిన్నటి తరం కథానాయిక. జనసేనాని పవన్ కల్యాణ్ మాజీ భార్య, రేణూ దేశాయ్.. చిత్ర కథలో వాస్తవాలను పోందుపర్చడంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అమె చిత్రానికి సంబంధించిన స్ర్కీన్ ప్లే వర్కును పూర్తి చేసుకున్న అమె.. కథకు సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అమె ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.

క్రితం రోజు రాత్రే మంత్రాలయం చేరుకున్న ఆమె స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేశారు. అనంతరం ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరమర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. బాధిత కుటుంబాల పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని పూర్తిగా రాసుకోనుంది.

ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకోగా.. అదే ఏడాది డిసెంబర్‌ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు రేణూదేశాయ్.. వారి కుటుంబాలను పరామర్శించి వారి కథలను తన సినిమాతో ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారు. ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తూ రైతుల సమస్యలపై సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆమె డైరెక్టర్ గా గతంలో మారఠీలో ’ఇష్క్‌ వాలా లవ్‌’ అనే చిత్రాన్ని రూపొందించిన అమె.. ఇఫ్పుడు రైతుల సమస్యలపై సినిమా తెరకెక్కిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  farmers  kurnool  alluru  direction  film story  tollywood  

Other Articles