Ram Charan apologies for making VVR నిజాన్ని నిర్భయంగా అంగీకరించిన మెగాపవర్ స్టార్..

Ram charan accepts vvr s flop writes letter to fans

Ram Charan, Boyapati Sreenu, Kaiara Advani, Devi Sri Prasad, VVR, Vinaya Vidheya Rama, DVV Entertainment, Sneha, Vivek Oberoi, Vinaya Vidheya Rama Result, Ram Charan Facebook, movies, entertainment, tollywood

Ram Charan accepted that they did go wrong in Boyapati Srinu directed 'Vinaya Vidheya Rama' as "the vision could not get translated properly on screen." He regretted that they "could not meet your expectations".

నిజాన్ని నిర్భయంగా అంగీకరించిన మెగాపవర్ స్టార్..

Posted: 02/05/2019 12:57 PM IST
Ram charan accepts vvr s flop writes letter to fans

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా.. బోయపాటి దర్శకత్వంలో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన చిత్రం.. వినయ విధేయ రామ. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడంలో కొద్దిమేరకు విజయం సాధించినా.. నిజానికి అశించిన అంచనాల మేరకు సవ్వడి చేయలేకపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ అంగీకరించాడు.

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా పంపిణీదారులకు నష్టాల్ని మిగిల్చింది. ఈ ఫలితంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. అంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో నటించిన చిత్రం రంగస్థలం ఏకంగా వంద రోజుల పండుగను జరుపుకుని, రెండు వందల క్లబ్ లోకి చేరగా.. వినయ విధేయ రామ కలెక్షన్స్ కృష్ణా రామా అంటూ 60 కోట్ల మేర మాత్రమే సాధించాయి.

ఈ విషయాన్నే చరణ్ నేరుగా ఒప్పుకున్నాడు.  అందరినీ వినోదింపచేసే సినిమా ఇవ్వాలని చాలా ట్రై చేశాం.  కానీ దురదృష్టవశాత్తు అనుకున్నట్లు మంచి సినిమా ఇవ్వలేకపోయాం.  భవిషత్తులో మీరు మెచ్చే, మీకు నచ్చే సినిమాలు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను.  మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ఓపెన్ లెటర్ విడుదల చేశాడు.  భారీ పరాజయం నుండి చరణ్ త్వరగా బయటపడి రియలైజ్ అవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Boyapati Sreenu  Kaiara Advani  Vinaya Vidheya Rama  Facebook  Tollywood  

Other Articles