Actress Shamita Shetty verbally abused in road rage case శిల్పాశెట్టి సోదరి షమితాశెట్టిపై అగంతకుల దాడి

Shamita shetty abused driver attacked by 3 men in mumbai road rage incident

Shamita Shetty Verbally Abused, Shamita Shetty accident, Shamita Shetty road rage, Shamita Shetty verbally abused, Driver Roughed Up In a Road Rage Incident in Thane, Shilpa Shetty Sister Shamita Shetty Car Accident, shamita Shetty, Actress Shamita Shetty, Shilpa shetty Sister Shamita Shetty, Shamita Shetty car Accident, Shamita Shetty Verbally Abused, Drivier Roughed up, crime

Actress Shamita Shetty was verbally abused and her driver was thrashed in a road rage incident near Viviana Mall in Thane, Mumbai. The incident occurred at 1.30pm after a biker rammed into Shamita's car.

శిల్పాశెట్టి సోదరి షమితాశెట్టిపై అగంతకుల దాడి, కారు ధ్వంసం

Posted: 01/31/2019 11:33 AM IST
Shamita shetty abused driver attacked by 3 men in mumbai road rage incident

ప్రముఖ బాలీవుడ్ నటి, యోగా శిక్షకురాలు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అమె ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి.. అమె కారు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. ముంబై సమీపంలో జరిగిన ఈ దాడి ఘటనపై అమె థానే పోలీసులకు పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. షమితా శెట్టి కారులో ప్రయాణిస్తుండగా.. బైకుపై ఇద్దరు స్నేహితులుతో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఆమె కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది.

ఈ క్రమంలో షమితా శెట్టి డ్రైవర్ కు ఆ యువకుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సదరు వ్యక్తులు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. ఇదేమిటని కారులో ఉన్న షమితా ప్రశ్నిస్తే.. ఆమెపై సదరు వ్యక్తులు బూతుల దండకం అందుకున్నారు. అమె ప్రయాణిస్తున్న కారును కూడా ధ్వంసం చేశారు. ముంబై సమీపంలోని థానే వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో అమె పోలీసులను అశ్రయించి.. ఘటనపై పిర్యాదు చేసింది.

షమితా శెట్టి పిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అగంతకుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణం ఎవరన్న విషయం దర్యాప్తులో వెల్లగడవుతుందని.. కాగా.. ఇలా దాడులకు పాల్పడటం కూడా నేరమని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ చిత్రం ‘మెహబ్బతే’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన షమితా శెట్టి...శిల్పాశెట్టిలా బాలీవుడ్‌లో మెరుపులు మెరిపించలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ టీవీ రియాల్టీ షోస్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shamita Shetty  Verbally Abuse  Driver Roughed Up  Car Accident. Crime  

Other Articles