Brahmanandam undergoes heart surgery బ్రహ్మానందం ఆరోగ్యంపై ప్రముఖుల వాకబు

Noted telugu actor brahmanandam undergoes heart surgery

Brahmanandam, comedy actor brahmanandam, brahmanandam sick, brahmanandam heart surgery, brahmanandam mumbai hospital, Brahmanandam celebrities, Brahmanandam tollywood, tollywood noted comedian, tollywood, movies, entertainment

After, Brahmanandam, a popular comedy actor in Tollywood, had to undergo heart bypass surgery, many celebrities of the Industry called up his family members and consoled them. He has acted in over 1000 films in Telugu and Tamil.

బ్రహ్మానందం ఆరోగ్యంపై ప్రముఖుల వాకబు

Posted: 01/17/2019 03:31 PM IST
Noted telugu actor brahmanandam undergoes heart surgery

తెలుగు వెండితెర నవ్వుల రాజు బ్రహ్మానందంకు సంక్రాంతి రోజున బైపాస్ సర్జరీ జరిగిందన్న వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు.. ఆయన అరోగ్యం ఎలా వుందన్న బ్రహ్మానందం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. ఆయన కొలుకుంటున్నారని, అందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదని వైద్యులు చెప్పారని కుటుంబసభ్యులు ఇస్తున్న సమాచారంతో టాలీవుడ్ ప్రముఖులు ఊరట పోందుతున్నారు.

ఆయనతో పాటు సినీరంగంలో ప్రయాణం సాగించిన మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు, కూడా ఫోన్ ద్వారా బ్రహ్మానందం అరోగ్యం పట్ల వారి కుటుంబసభ్యులను వాకబు చేశారని సమాచారం. మరీ ముఖ్యంగా ఆయనతో సన్నిహిత్యం ఉన్న నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయన అరోగ్యం పట్ల తెలుసుకుంటున్నారు.

గుండె శస్త్రచికిత్స అనంతరం కనీసం వారం రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంచి, ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని వైద్యులు చెప్పారని కూడా బ్రహ్మానందం కుటుంబ సభ్యులు తమకు ఫోన్ చేసిన ప్రముఖులకు తెలియజేశారు. అయితే హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే అభిమానులతో ఇబ్బందులు వుంటాయన్న కారణంగానే ముంబైకి ఆయన్ను తీసుకెళ్లామని కూడా వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmanandam  comedian  heart surgery  mumbai hospital  celebrities  tollywood  

Other Articles