Actor Yash's fan succumbs after immolation ప్రాణాలు తీసే అభిమానం ప్రమాదమంటున్న యంగ్ హీరో

Actor yash s fan who tried self immolation breathes his last

yash, yash fan suicide, yash fan dead, yash fan burns himself, Ravi Raghuram, kgf, kgf box office collection, sandalwood, tollywood, movies, entertainment

Ravi Raghuram, a fan of Kannada star Yash, burned himself when he couldn't meet the star. The youngster had gone to meet the Kannada actor on his birthday in his residence.

ప్రాణాలు తీసే అభిమానం వద్దంటున్న యంగ్ హీరో

Posted: 01/10/2019 08:13 PM IST
Actor yash s fan who tried self immolation breathes his last

తన అభిమాన హీరోతో తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదనే ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని కన్నడ స్టార్ హీరో యశ్ నివాసం ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డిన అభిమాని ఇవాళ తన తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని పావగడ ప్రాంతానికి చెందిన రవి (28) యశ్ కు వీరాభిమాని. బెంగళూరులోని లగ్గెరె ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నాడు. ప్రతి ఏటా జనవరి 8న యశ్ నివాసానికి వచ్చి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాడు.

అయితే, ప్రముఖ నటుడు అంబరీష్ మృతితో ఈ ఏడాది జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి యశ్ సుముఖత చూపలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. అయినా, జన్మదినం రోజున ఉదయం యశ్ నివాసానికి అనేక మంది అభిమానులు వచ్చారు. అందులో ఒకరు రవి రఘురాం. రవిని కలిసేందుకు యశ్ నిరాకరించడంతో... మనస్థాపానికి గురై యశ్ నివాసం ముందే పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. వెంటనే అతన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా... ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మరణించాడు.

దీంతో యువ హీరో యశ్ ప్రాణాలు తీసుకునే అభిమానం చాలా ప్రమాదకరమని, ఇలాంటి అభిమానం తనకు వద్దని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తేల్చిచెప్పాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే అభిమానుల తమ తల్లిదండ్రుల గురించి కూడా ఒక్కసారి అలోచించాలని ఆయన వినమ్రంగా కోరారు. గత ఏడాది రఘురాం తనతో సెల్ఫీ దిగాడని పేర్కోన్నాడు. ఇది అభిమానం అనిపించుకోదని, ఇలాంటి  చర్యలకు పాల్పడే వాళ్లు తన అభిమానులు ఏలా అవుతారని ప్రశ్నించిన ఆయన ఇకపై తన అభిమానులు ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఈ ఘటన తనను చాలా కలచివేసిందని యశ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Raghuram  yash  yash fan dead  yash fan burns himself  Ravi Raghuram  kgf  sandalwood  tollywood  

Other Articles