NTR Biopic – Tarak In Key Role? ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.?

Tarak to play key role in balayya s ntr biopic

NTR Biopic, Bala Krishna, Jr Ntr, Tarak, Key role, Kathanayakudu, Mahanayakudu, tollywood, movies, entertainment

Now, the latest rumour in the film industry is that Young Tiger Jr NTR is expected to be seen in a special role, in the second part of the film playing the younger version of Balakrishna Nandamuri

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.? ఎవరిలా అంటే..

Posted: 10/22/2018 09:17 PM IST
Tarak to play key role in balayya s ntr biopic

దివంగత ముఖ్యమంత్రి, అంధ్రుల అభిమాన నటుడు, ఆరాధ్యుడు స్వర్గీయ నందమూరి తారాక రామారావు జీవిత కథ ఆధారంగా.. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' అనే పేర్లతో ఈ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు స్టార్ల పేర్లు, వారి ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి.

ఈ చిత్రంలో నటించే తారాగణం పేర్ల జాబితా ఇప్పటికే చెంతాడంత తయారవ్వగా.. రెండు బాగాలుగా తెరకెక్కుతున్న క్రమంలో ఇక రోజు రోజుకీ కొత్త నటీనటులకు కూడా అవకాశాలు వస్తున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాలో తారక్ కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నారని చిత్రపురి వర్గాల సమాచారం.  ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తున్నారు. మరి బాలయ్య పాత్రను ఎవరు పోషించనున్నారు? అభిమానులందరిలో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఇది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఈ పాత్రను పోషిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి.

తాజాగా, ఇప్పుడు మరో సంచలన వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే, బాలయ్య క్యారెక్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే జూనియర్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR Biopic  Bala Krishna  Jr Ntr  Tarak  Key role  Kathanayakudu  Mahanayakudu  tollywood  

Other Articles