Sumanth Subrahmanyapuram Teaser ఆసక్తి రేపుతున్న ‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్

Sumanth s subrahmanyapuram teaser comes out

Subrahmanyapuram Official Teaser, Subrahmanyapuram. Sumanth, Subrahmanyapuram sumanth, sumanth eesha rebba, Eesha Rebba, Subrahmanyapuram santhossh jagarlapudi, Santhossh Jagarlapudi, movies, entertainment, tollywood

Actor Sumanth's 25th film is titled as Subrahmanyapuram. The shooting has been wrapped up and the first look teaser of the film has been unveiled.

ఆసక్తి రేపుతున్న ‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్

Posted: 10/20/2018 03:15 PM IST
Sumanth s subrahmanyapuram teaser comes out

సంతోష్ దర్శకత్వంలో .. సుమంత్ హీరోగా 'సుబ్రహ్మణ్య పురం' రూపొందింది. ఈషా రెబ్బా కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ‘డబ్బు ఉండే సరికి నాలుగు గోడలు లేపేసి జనాలకు భక్తి ఉంది కాదా అని ఏదో ఒక రాయిని విగ్రహంగా పెట్టేస్తే.. అది దేవాలయం అవుతుందా చెప్పు’ అంటూ ‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ టీజర్‌తో వచ్చేశాడు సుమంత్. ‘మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న సుమంత్ 25వ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను విజయదశమి కానుకగా విడుదల చేశారు హీరో సుమంత్. 'సుబ్రహ్మణ్య పురం' అనే ఊరు .. ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి కారణమైన 'సుబ్రహ్మణ్య స్వామి' ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఆలయం నేపథ్యంలో చోటుచేసుకునే ఆసక్తికరమైన సంఘటనలతో ఈ కథ కొనసాగుతుంది. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ టీజర్ ఉంది. నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా నటించిన సుమంత్.. భక్తి ముసుగులో జరిగే మోసాల్ని వెతికిపట్టే పనిలో పడ్డాడు.

ఇండియన్ టెంపుల్స్ పై హేతుబద్ధంగా రీసెర్చ్ చేసిన కార్తీక్ పాత్రలో సుమంత్ ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. నాస్తికుడిగా కనిపించే కార్తీక్ కి ఆ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కున్నాడు? అనే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగనుంది. 'కార్తికేయ' సినిమా ఛాయలు కనిపిస్తోన్న ఈ సినిమా, సుమంత్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subrahmanyapuram  Sumanth  Eesha Rebba  Santhossh Jagarlapudi  tollywood  

Other Articles