RGV Puts Spotlight On Chandrababu చంద్రబాబును పట్టించు.. లక్ష పట్టుకెళ్లు: అర్జీవి

Rgv announces reward for chandrababu

chandrababu naidu, ram gopal varma, "Lakshmi's NTR", lakshmi parvati, AP Chief Minister, social media, viral video, chandrababu lookalike, movies, entertainment, tollywood

Ram Gopal Varma has announced that he would reward anyone who helps him tracking down Nara Chandrababu Naidu. He posted a video in which a man is serving food at a hotel.

చంద్రబాబును పట్టించు.. లక్ష పట్టుకెళ్లు: అర్జీవి

Posted: 10/13/2018 05:46 PM IST
Rgv announces reward for chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్ర‌బాబును ప‌ట్టించు.. లక్ష రూపాయలను పట్టుకెళ్లు అన్న ఆపర్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చంద్రబాబును పట్టించడం ఏంటి... ఈ ఆఫర్ ఎవరి నుంచి వెలువడింది అనగానే దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి. అస‌లు వ‌ర్మ ఏమైనా మ‌తుండే మాట్లాడుతున్నాడా.. చిన్నా, పెద్ద అంతరం తెలియకుండా ఇలాంటి ప్రచారం చేయడమేంటి అని నిలదీసే అభిమానులు కూడా లేకపోలేరు.

అవును నిజ‌మే కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వ‌డానికి వ‌ర్మ కూడా పిచ్చోడు అయితే కాదు క‌దా.. అయితే ఆయనేం చేసినా తనకు ప్రచారం ఫ్రీగా కలసిరావాలనే అన్వేషించే వ్యక్తి అర్జీవి. ఇలా చంద్రబాబు విషయంలోనూ సంచ‌ల‌నం చేసేందుకు ఈ ప్రకటన ఇచ్చాడా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రచారం విషయం ఎలా వున్నా తన ప్రకటనతో అర్జీవి మరోసారి కావాలనే కావాల్సినంత అగ్గి రాజేసాడు.

సోష‌ల్ మీడియాలో రెండు రోజులుగా డూప్ చంద్ర‌బాబునాయుడు ఒక‌రు బాగా స‌ర్కిలేట్ అవుతున్నాడు. హోట‌ల్లో ప‌నిచేసే ఆయ‌న ఛ‌ట్నీ వ‌స్తూ సైడ్ కోణంలో అచ్చం చంద్ర‌బాబును దించేసాడు. ఈ ఫోటోతో పాటు వీడియో కూడా వైర‌ల్ అయిపోయింది. ఇప్పుడు ఈయ‌న విజువ‌ల్ ను ప‌ట్టుకుని ఆయ‌న్ని త‌న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" లో పెట్టుకుంటాన‌ని చెబుతున్నాడు వ‌ర్మ‌. ఇందుకోసం తనదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టిన అర్జీవి ఇలాంటి సంచలన ప్రకటన విడుదల చేశాడు.

అచ్చంగా చంద్రబాబులా కనిపిస్తున్న ఆయన డూప్ ను.. మొద‌ట ఎవ‌రు ప‌ట్టించినా వాళ్ల‌కు ల‌క్ష రూపాయ‌లు ఇస్తాన‌ని చెబుతున్నాడు. దానికోసం అడ్ర‌స్ కూడా ఇచ్చాడు. ఎవ‌రైతే ముందు ఈయ‌న అడ్ర‌స్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి పంపిస్తారో వాళ్ల‌కు ల‌క్ష రూపాయ‌లిస్తానంటున్నాడు. ఆయ‌న్నే త‌న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్"లో చంద్ర‌బాబు పాత్ర‌కు తీసుకుంటానంటున్నాడు‌. అస‌లే ఈయ‌న చేస్తున్న బ‌యోపిక్ "ఎన్టీఆర్" జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ నుంచి మొద‌ల‌వుతుంది. మ‌రి అక్క‌డ చంద్ర‌బాబు పాత్రే కీల‌కం కానుంది. మరి చంద్రబాబు డూప్ అడ్రస్ దొరుకుతుందో లేదే వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles