'DEVDAS' Cleared Censor with U/A సెన్సార్ దాటి.. విడుదలకు సిద్దమైన దేవదాస్..

Nagarjuna nani starrer devdas is a clear winner

Nani, Nagarjuna, devadas, release date, aditya sriram, rashmika mandana, akansha singh, movies, entertainment, tollywood

One of the most anticipated projects of Tollywood this month happens to be the crazy multistarrer flick Devadas, directed by Sriram Aditya of Shamantakamani,

విడుదలకు సిద్దమైన దేవదాస్.. ప్రీరిలీజ్ మార్కెట్ అంతా.!

Posted: 09/25/2018 06:23 PM IST
Nagarjuna nani starrer devdas is a clear winner

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా రూపోందిన మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్'. అప్పటి దేవదాస్ ప్రేమికుల కంట కన్నీళ్లను కార్చేలా చేస్తే.. ఇప్పటి దేవదాస్ కూడా అదే పని చేస్తుంది. అయితే ఇక్కడే ఒక ట్వీస్టు వుంది. అదేంటంటే అప్పటి అక్కినేని ఏడిపించి కన్నీళ్లను రాబడితే.. ఇప్పటి దేవదాసు మాత్రం నవ్వును అపుకోలేక ప్రేక్షకులు ఆనందబాష్ఫాలను రాల్చుతారని అంటున్నారు. అంటే ఇది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమైంది.

ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సన్నధంగా వుంది. డాన్ గా నాగార్జున ..  డాక్టర్ గా నాని నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని తెలుస్తోంది. ఆంధ్రాలో 14 కోట్లకు .. నైజామ్ లో 11 కోట్లకు .. సీడెడ్ లో 5 కోట్లకి .. ఓవర్సీస్ లో 4.50 కోట్లకు పంపిణీ హక్కులు అమ్ముడైనట్టుగా సమాచారం.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ హక్కులు 30 కోట్లకి అమ్ముడుపోగా, ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. నాగ్ .. నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే ఈ నెల 27 వరకు అగితే సరి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Nagarjuna  devadas  release date  aditya sriram  rashmika mandana  akansha singh  tollywood  

Other Articles