Lady Superstar's box office glory! బాక్సాఫీసు బద్దలు కొడుతున్న నయనతార చిత్రం

Nayanthara s coco official box office collection report

nayantharas coco official box office collection report news, Nayanthara, Kolamaavu Kokila, CoCo, Imaikkaa Nodigal, CoCo Kokila, Nayantata, box office, tollywood, lady oriented movie, new record, latest movie news, kollywood, movies, entertainment

Nayanthara's latest film Kolamaavu Kokila aka CoCo which released on 17th August is running successfully in cinemas. The official box-office collection is out, in 10 days, the film has grossed more than 20 crores in Tamil Nadu alone and has been declared as a Super-Hit.

బాక్సాఫీసు బద్దలు కొడుతున్న నయనతార

Posted: 08/27/2018 05:12 PM IST
Nayanthara s coco official box office collection report

దక్షిణాదిలో మరీ ముఖ్యంగా అగ్రకథ నాయికగా వెలుగొందుతున్న నటి నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరంలేదు. నిర్మాతల పాలిట కల్పతరువుగా మారిన నయన.. తమ చిత్రాలలో నటిస్తే చాలని భావిస్తుంటారు నిర్మాణ సంస్థలు. ఎందుకంటే అమెకు వున్న క్రేజ్ అలాంటిది. అమె ఏచిత్రంలో నటించినా తమ డబ్బులు వచ్చేస్తాయన్నది గత చిత్రాల నుంచి వచ్చిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా అమె విభిన్నమైన కథా చిత్రాలు ఎంచుకుని లేడి ఒరియంటెండ్ చిత్రాలలో నటిస్తుంది.

అయితే లేడీ ఒరియంటెండ్ చిత్రాలు కూడా వరుస విజయాలు అందుకుని ఆమె క్రేజ్ ను మరింతగా పెంచుతూ వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా చిత్రంగా 'కొలమావు కోకిల' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 9 రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా సౌత్ లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే మొదటి సారి. ఈ అరుదైన రికార్డును నయనతార సొంతం చేసుకోవడం పట్ల ఆమె అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో ఈ సినిమాను 'కోకో కోకిల'అనే పేరుతో ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమా ఆమెకి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CoCo Kokila  Nayantata  box office  tollywood  lady oriented movie  new record  kollywood  

Other Articles