chiranjeevi celebrates his birthday ar allu aravind house అల్లువారింట చిరు జన్మదిన వేడుకకు పవన్..

Chiranjeevi celebrates his birthday ar allu aravind house

pawan kalyan at chiru bithday party, pawan kalyan at chiranjeevi birthday party, allu aravind chiranjeevi birthday, allu venkat chiranjeevi, allu arjun chiranajeevi, allu shirish chiranjeevi, ram charan tej chiranjeevi birthday, allu sneha reddy chiranjeevi, upasana konidela chiranjeevi birthday, ganta srinivas rao chiranjeevi, raghuram krishnam raju chiranjeevi birthday, dilip byra chiranjeevi, chiranjeevi latest news, chiru news, chiranjeevi sye raa news, chiranjeevi upcoming movies, tollywood

Former Union Minister, present Rajya sabha member, Tollywood megastar Chiranjeevi celebrated his birthday hosted by Allu Aravind at his tesidence, only the family members, near and dear attended the party.

అల్లువారింట అట్టహాసంగా చిరంజీవి జన్మదిన వేడుకలు..

Posted: 08/23/2018 11:08 AM IST
Chiranjeevi celebrates his birthday ar allu aravind house

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 64వ పడిలోకి అడిగిడిన సందర్భాన్ని పురస్కరించుకుని స్టార్ ప్రోడ్యూసర్, అల్లు అరవింద్ తన నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో పాటు కొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే పరిమితం కాగా, ఈ గ్రాండ్ ఈవెంట్ లో పలువురు చిరంజీవి సన్నిహితులు, సినీ, రాజకీయ రంగంతో పాటు విభిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Megastar Chiranjeevi Birthday Celebrations

మెగా కుటుంబంతో పాటు అల్లు కుటుంబం జరుపుకున్న ఈ చిరంజీవి జన్మదిన వేడుకలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరై సందడి చేయడం విశేషం. మరీ ముఖ్యంగా సినీపరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో ఆయన సరదాగా గడిపారు. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ ధర్శకులు బోయపాటి శ్రీను, వక్కంతం వంశీ, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, సుకుమార్, మెహర్ రమేష్, పరుశురామ్ తదితరులు కూడా హాజరయ్యారు.

Megastar Chiranjeevi Birthday Celebrations

ఈ సందర్భంగా అల్లు అరవింద్ ప్రత్యేకంగా తెప్పించిన కేక్ ను చిరంజీవి కట్ చేసి తన సహధర్మచారిణి అయిన సురేఖకు తినిపించారు. ఆ తరువాత అల్లు అరవింద్ చిరంజీవికి కేక్ తినిపించారు. అనంతరం వేడుకకు హాజరైన ప్రముఖులు ఒక్కోక్కరుగా చిరంజీవికి కేక్ తినిపించి.. జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో టీడీపీ నేత రఘురామ క్రిష్ణంరాజు, జనసేన పార్టీ కోఅర్డినేషన్ కమిటీ సభ్యుడు దిలిప్ బైరా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles