Srinivasa Kalyanam Box Office Collections శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీసు కలెక్షన్లు ఇలా..

Srinivasa kalyanam latest box office collections report

Box Office Collections, Srinivasa Kalyanam, Satish Vegesna, Nithiin, Raashi Khanna, Tollywood Box Office Collections 2018, Tollywood, movies, entertainment

Nithiin and Raashi Khanna starrer Srinivasa Kalyanam could not do well at the box office on the first day. Srinivasa Kalyanam though arrived as a family entertainer failed to live up to the expectations.

శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీసు కలెక్షన్లు ఇలా..

Posted: 08/11/2018 12:53 PM IST
Srinivasa kalyanam latest box office collections report

నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రం నేటి తరానికి వివాహ విశిష్టతను తెలియజేసేలా వుందని ప్రశంసలను అందుకున్నా.. ఆ మేరకు మాత్రం బాక్సాఫిసు వద్ద కలెక్షన్లు మాత్రం అశించిన స్థాయిలో రాబట్టలేదని.. అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా ఫర్వాలేదని అంటూనే.. థియేటర్లో కూర్చుని పెళ్లి క్యాసెట్ ను చూసినట్టుగా అనిపిస్తుందని.. చిత్రానికి 60 శాతం మార్కులను మాత్రమే వేశారు రివ్యూయర్లు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసుకుని రూపొందించినది కాబట్టి.. ఇలా ఉన్నా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా వసూళ్ల గురించి చెబుతూ ఫర్వాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తొలి రోజున ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయని సమాచారం. ఈ మధ్య నితిన్ కు కూడా సరైన హిట్ లేదు. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’ సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయాయి. వాటి రూపకర్తలకు లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. ఇలా నితిన్ ఫామ్ లేమి ప్రభావం ‘శ్రీనివాస కల్యాణం’ మీద స్వల్పంగా కనిపిస్తోంది. అయినప్పటికీ తొలి రోజుకు ఈ సినిమా 2.77 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.

ఓవర్సీస్ ను మినహాయించి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణం తొలి రోజున ఈ వసూళ్లను రాబట్టినట్టుగా సమాచారం. ఈ సినిమా బడ్జెట్ కొంత భారీగానే ఉంది. ఓపెనింగ్స్ అందుకు తగ్గట్టుగానే ఉన్నా.. ఈ సినిమా సాధించాల్సింది మాత్రం ఇంకా చాలా ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు కొంత పోటీ కూడా ఉంది. కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం 2’ ఈ వారంలోనే విడుదల అయ్యింది. గత వారం సినిమా ‘గూఢచారి’ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘శ్రీనివాస కల్యాణం’ ఈ వీకెండ్‌లో ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivasa Kalyanam  Satish Vegesna  Nithiin  Raashi Khanna  Box Office Collections  Tollywood  

Other Articles