Simran, Nawazuddin Siddiqui Confirmed In Rajini movie ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సరసన సిమ్రాన్..

Simran and nawazuddin siddiqui join rajinikanth s upcoming film

rajinikanth, simran, karthik subbara, vijay sethupathi, bobby simhaa, rajinikanth movie, rajinikanth upcoming movie, rajinikanth simran, simran rajinikanth, movies, kollywood, entertainment, tollywood

Apart from Rajinikanth, Simran and Nawazuddin Siddiqui, the Karthik Subbaraj film will also star Vijay Sethupathi, Bobby Simhaa, Sananth Reddy and Megha Akash.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సరసన సిమ్రాన్..

Posted: 07/19/2018 06:59 PM IST
Simran and nawazuddin siddiqui join rajinikanth s upcoming film

తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెండితెరను ఏలిన సిమ్రాన్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమల్లోని అగ్రహీరోలు మొదలుకుని యువ కథానాయకుల వరకు అందరితో నటించి.. మెప్పించింది. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సరసన నటించిన సిమ్రాన్.. అటు కాలీవుడ్ లోనూ కమల్ హాస్సన్ నుంచి మొదలు పెడితే అబ్బాస్ వరకు అందరితో నటించింది. ఇంతమంది హీరోలతో నటించినా.. అమెకు అప్పట్లో దక్కని అవకాశం తాజాగా వరించింది.

ఔనా.! అంటూ ఆశ్చర్యపోతున్నారా. ఇంతకీ ఆ అవకాశం ఏంటీ..? ఎవరా హీరో అంటారా.. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో నటించిన సిమ్రాన్ తొలిసారిగా రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్.. అమె సెకండ్ ఇన్నింగ్స్ లో దక్కించుకుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ రూపోందిస్తున్న చిత్రంలో ఇప్పటి వరకు హీరోయిన్ కన్ఫామ్ కాలేదు. అయితే ఈ పాత్రకు సిమ్రాన్ కరెక్టుగా సరిపోతుందని చిత్రవర్గాలు అమెను తాజాగా ఎంపిక చేశాయన్న వార్తలు వినబడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. రజనీ .. విజయ్ సేతుపతి కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. రీసెంట్ గా ఈ సినిమా కోసం సిమ్రాన్ ను .. నవాజుద్దీన్ సిద్ధిఖీని తీసుకున్నారు. రజనీకి భార్యగా సిమ్రాన్ కనిపించనుందని అంటున్నారు. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ .. నెగెటివ్ పాత్రను చేయనున్నాడని చెబుతున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను వేసవికి విడుదల చేయనున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  simran  karthik subbara  vijay sethupathi  bobby simhaa  kollywood  

Other Articles