Sony accidentally uploads movie on YouTube ట్రైలర్ బదులు సినిమా.. యూట్యూబ్ లో అప్ లోడ్..

Sony pictures accidentally uploads entire khali the killer movie on youtube

Khali, Khali the killer, Sony Pictures, red-band, YouTube, Jon Matthews, film leak, Sony Pictures Entertainment, Richard Cabral, movies, entertainment, Hollywood

In an apparent goof-up, Sony Pictures Entertainment accidentally uploaded the entire film, Khali the Killer on its YouTube channel instead of the red-band trailer.

ట్రైలర్ బదులు సినిమా.. యూట్యూబ్ లో అప్ లోడ్..

Posted: 07/04/2018 07:36 PM IST
Sony pictures accidentally uploads entire khali the killer movie on youtube

ఓ సినిమాను తెరకెక్కించడానికి పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందిస్తారు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో ఖర్చు చేస్తారు. తాము తీసిన సినిమాలో ఒక్క సీన్ కూడా లీక్ అవకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది సినిమా నిర్మాణ సంస్థే పొరపాటున ట్రైలర్‌కు బదులు సినిమాను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. 8గంటల తర్వాత విషయాన్ని తెలుసుకుంది. చేసేదేమీ లేక దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇలా ఘోర తప్పిదానికి పాల్పడింది ఏ చిన్నా చితకా నిర్మాణ సంస్థో అనుకునేరు. కాదండీ.. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించే ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్మంట్స్. జూలై 3న సోనీ తన యూట్యూబ్ ఛానల్‌లో ‘రెడ్ బ్యాండ్’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్‌కు బదులు పొరపాటున ఓ సినిమానే అప్ లోడ్ చేసింది. దీనిని ఓ సంస్థ గమనించి విషయాన్ని సోని పిక్చర్స్ దృష్టికి తీసుకువచ్చే వరకు సోని తాను అప్ లోడ్ చేసిందేమిటన్నది చూసుకోకపోవడం గమనార్హం.

జాన్ మాథ్యూస్ డైరెక్షన్‌లో.. రిచర్డ్ కాబ్రల్ లీడ్ రోల్ ఫోషించిన.. ‘ఖాళీ ది కిల్లర్’ అనే 89 నిమిషాల పూర్తి సినిమాను అప్‌లోడ్ చేసింది. దీనిని గమనించిన సీబీఆర్.కమ్ అనే వెబ్‌సైట్ వెంటనే సదరు నిర్మాణ సంస్థకు విషయాన్ని తెలిపింది. అప్పటికే ఆ సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి 8గంటలు. అప్పటికే చాలామంది యూట్యూబ్‌లో ఆ సినిమాను చూసేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ మూవీ రెంటల్ బేసిస్‌పై అందించేందుకు సోనీ సంస్థ చర్యలు తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khali  Khali the killer  Sony Pictures  red-band  YouTube  Hollywood  

Other Articles