Nasser To Play Lead Role In KCR Biopic ఉద్యమసింహంగా కేసీఆర్ బయోపిక్.. లీడ్ రోల్ లో నాజర్..

Nasser to play lead role in kcr biopic

K chandrashekar rao, KCR, nasser, biopic, ys rajashekar reddy, NT Rama Rao, savitri, nasser to play as kcr, nasser as kcr, udyama simham, KCR Biopic, Nasser To Play Lead Role In KCR Biopic,Biopic On Telangana CM KCR,Nasser To Play KCR Role,#KCRBiopic,TFC Films And Film News,Tollywood Updates,Latest Upates,tfc film news,Biopic trend In TOllywood,Celebrity Updates,Biopic On KCR,Nasser To Act As,Latest Gossips,Celebrity news,Biopics On Celebrities,telugu Full movies,tollywood news,cm kcr,telangana cm,film news,Udyama Simham,Nasser,Nasser As KCR, Telangana State, Tollywood biopics, movies, entertainment, tollywood

Biopic Trend Starts In Tollywood, As one side NTR biopic is set to go on to the sets, followed by YS Rajashekar reddy's bipoic, Now Recently Biopic Started On Telangana CM KCR, in which Nasser is playing the lead role of KCR.

ఉద్యమసింహంగా కేసీఆర్ బయోపిక్.. లీడ్ రోల్ లో నాజర్..

Posted: 06/28/2018 06:51 PM IST
Nasser to play lead role in kcr biopic

వెండితెరపై ప్రస్తుతం బయోపిక్స్ చిత్రాల హవా కొనసాగుతుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, ధోని తరువాత సంజుతో త్వరలో ధియేటర్లకు రానున్న ప్రముఖ సినీనటుడు సంజయ్ దత్.. వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటు తెలుగునాట కూడా బియోపిక్స్ కు మంచి ఆదరణ ఏర్పడుతోంది. యువ దర్శకులు, నిర్మాతలు సమాజంలోని ప్రముఖ వ్యక్తుల జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది.

ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనుండగా, బాలకృష్ణ టైటిల్ రోల్లో మెరవనున్నారు. ఇటీవలే అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ ను వెండితెరపై అవిష్కరించి.. అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీదిగ్గాజాల మన్ననలను కూడా పోందారు దర్శకులు. ఇదే క్రమంలో దిగవంతనేత రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర పేరుతో ఓ బయోపిక్ తాజాగా మొదలైంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపించనుండగా, మహి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు ఇదే కోవలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోంది. మొదట్లో కేసీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తారని ప్రచారం జరిగినా, చివరకి విలక్షణ నటుడు నాజర్ ని ఫైనల్ చేశారట. ఉద్యమ సింహం అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కృష్ణం రాజు తెరకెక్కించనున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మాణంలో ఈ బయోపిక్ రూపొందనుంది. ఇవాళే అన్నపూర్ణ స్టూడియోస్ లో అధికారికంగా లాంచ్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K chandrashekar rao  KCR  nasser  biopic  ys rajashekar reddy  NT Rama Rao  savitri  tollywood  

Other Articles