దేశవ్యాప్తంగా పెను సంచలన చిత్రంగా ప్రత్యేకతను సాధించి.. భారతీయ చలనచిత్ర రంగంలో ఒక తెలుగు సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకుందన్న రికార్డును నెలకొల్పిన చిత్రం..'బాహుబలి'. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా రాణా సంపాదించిన క్రేజ్ కూడా అంతాఇంతా కాదు. దీంతో ఆయన తన క్రేజ్ ను కాపాడుకుంటూ .. దానిని మరింత పెంచుకునే కథలను మాత్రమే అంగీకరిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో విజయాన్ని అందుకుని దూసుకుపోతున్నాడు రాణా.
ఈ నేపథ్యంలోనే ఆయన హిందీలో 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఏనుగులతో హీరోకి గల స్నేహ సంబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన ఎక్కువభాగం షూటింగ్ అడవుల్లో జరుగుతోంది. హిందీతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి 'కాదన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇటీవలే రెండో షెడ్యూలు కూడా పూర్తైంది. రమారమి ఈ చిత్రం మరో షెడ్యూలు తరువాత షూటింగ్ కు సెలవు ప్రకటించనుందని టాక్. దీంతో రిరికార్డింగ్ సహా పోస్టు ప్రోడక్షన్ పనులను పూర్తి చేసుకుని దీపావళి పండగ బరిలో ఈ సినిమాను నిలపాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని ఒకేసారి ఈ మూడు భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఈ మూడు భాషల్లోను విజయాన్ని సాధిస్తుందనీ .. తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందని రానా భావిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more