Jr NTR and wife had welcome their second child? ఎన్టీఆర్ దంపతులకు పండంటి పాపా.? నెట్టింట్లో వైరల్

Viral jr ntr and wife had welcome their second child

jr ntr, pranathi, lakshmi pranathi, tarak, abhay, ntr son, ntr welcomes second child, ntr couple parents of a girl child, tollywood, movies, entertainment

2018 is been a special year for Telugu superstar Jr NTR, says netizens as it is the viral news as of now in telugu states. Jr NTR and his wife Pranathi become parents for the second time.

ఎన్టీఆర్ దంపతులకు పండంటి పాపా.? నెట్టింట్లో వైరల్

Posted: 06/04/2018 04:01 PM IST
Viral jr ntr and wife had welcome their second child

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నటవారసులలో ఒకడిగా, బాల నటుడిగానే తన సత్తా ఎంటో చాటిన జూనియర్ ఎన్టీఆర్, తారక్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తుంది. ఈ వార్తను చూసి అభిమానులు తారక్ భయ్యా థాంక్యూ, కంగ్రాట్స్, అంటూ అభిమానులు తమ అనందాన్ని ఆయనతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఏ సినిమా విడుదలవ్వలేదు. కనీసం విడుదలైన చిత్రాలు మరో మైలురాయికి చేరకున్నది కూడా లేదు. కానీ ఎన్టీఆర్ కు మాత్రం శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి.

ఇంతకీ ఈ ఆనందం దేని గురించో మీకు తెలుసా.? ఇది పూర్తిగా ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమే అయినా.. సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఇక తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడికి చెందిన వార్త కావడంతో అయన అభిమానులు మహదానందంగా, సంతోషంగా వున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది. వారికి అభయ్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ విషయం మాకు తెలుసుకానీ అలసు విషయానికి రండీ అంటున్నారా.?

అక్కడికే వస్తున్నాం. అయితే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు మరోమారు తల్లిదండ్రులు అయ్యారు. ఔనా..? అంటున్నారు కదూ. ఆదివారం రాత్రి 10.20 గంటల సమయంలో పండంటి ఆడబిడ్డకు లక్ష్మీ ప్రణతి  జన్మించినట్టు సమాచారం. ఇప్పుడిక అభయ్ కి ఓ చెల్లెలు కూడా పుట్టిందన్న వార్త.. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం వెలువడలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  pranathi  lakshmi pranathi  tarak  abhay  girl child  tollywood  

Other Articles