Dulquer fans troll Rakul for post on Mahanati రకుల్ ఎందుకిలా చేశావ్.? ఇది నీకు తగునా.?

Dulquer fans troll rakul for post on mahanati

mahanati, rakul preet singh, Dulquer Salmaan, Nag Ashwin, keerthi suresh, savitri, gemini ganeshan, twitter, social media, movies, entertainment, tollywood

Actress Rakul Preet took to Twitter to appreciate the cast of Mahanati. In her post, she complimented Keerthy Suresh, Samantha and Vijay Deverakonda by tagging them, and left out Dulquer Salmaan, who essayed the role of Gemini Ganesan in the film.

రకుల్ ఎందుకిలా చేశావ్.? ఇది నీకు తగునా.?

Posted: 05/30/2018 07:48 PM IST
Dulquer fans troll rakul for post on mahanati

ఇప్పటివరకు అన్నింటా బేష్ అనిపించుకూంటూ ముందుకుసాగుతున్న దక్షిణాధి హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విటర్‌లో నటుడు దుల్కర్‌ సల్మాన్‌ అభిమానులు ఆమెపై మండిపడుతూ ట్వీట్లు చేశారు. అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో దుల్కర్‌ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సావిత్రి భర్త జెమిని గణేశన్‌ పాత్రలో కనిపించారు. టైటిల్‌ రోల్‌ పోషించిన కీర్తి సురేశ్‌తోపాటు ఆయన నటన కూడా అద్భుతంగా ఉందని విమర్శకులు, ప్రముఖులు ప్రశంసించారు. చిత్రం చక్కగా ఉందని ట్వీట్లు చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా రకుల్‌ ప్రీత్‌ కూడా ‘మహానటి’ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘చివరికి ‘మహానటి’ చిత్రాన్ని చూశాను. ఇది ఓ మాస్టర్‌పీస్‌.. సినిమాను ఇలా తెరకెక్కించిన మొత్తం యూనిట్‌కు కుడోస్‌. సావిత్రిగారు ఎప్పటికీ గుర్తుండి పోతారు. కీర్తి సురేశ్‌ ఎంత చక్కగా నటించావు. సమంత, విజయ్‌ దేవరకొండ కూడా చాలా బాగా చేశారు’ అని ట్వీట్‌ చేశారు. మరి దుల్కర్ సల్మాన్ అభిమానులు అమెపై ఎందుకు మండిపడుతున్నారు. అసలెందుకు విమర్శలు చేస్తున్నారు.? అంటే..

సినిమాలో అందరినీ అభినందించిన రకుల్.. దుల్కర్‌ పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన అభిమానులు మండిపడ్డేలా చేసింది. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన పేరును ట్వీట్‌ చేయకపోవడంతో విమర్శించారు. ‘సినిమాలో హీరో ఎవరో తెలుసా?, నిజంగానే సినిమా చూశావా?, జోక్‌ చేస్తున్నావా?, ఆయన మలయాళంలో సూపర్‌స్టార్ తెలుసా?, నువ్వు దుల్కర్‌ను మిస్‌ చేశావ్‌?..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. మరి ఈ కామెంట్లపై రకుల్ ఎప్పుడు.. ఎలా సమాధానం ఇస్తుందో వేచి చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles