madhavan to play villain role in savyasachi సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

Madhavan to play villain role in savyasachi

bhoomika, chandoo mundeti, madhavan, nagachaitanya, savyasachi, telugu cinema, tollywood, entertainment, tollywood

R Madhavan, who make a comeback in Tollywood with Naga Chaitanya's Savyasachi, a thriller film directed by Premam helmer Chandoo Mondeti is playing a villian role in the movie.

సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

Posted: 05/21/2018 06:21 PM IST
Madhavan to play villain role in savyasachi

రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో హీరోగా కూడా ఆయన పలు చిత్రాలలో నటించారు. కెరియర్ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన, పాత్రల ఎంపిక విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. తాజాగా ఆయన తెలుగులో 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాధవన్ ఏ పాత్రలో నటిస్తున్నారనేగా మీ ప్రశ్న. అక్కినేని నాగచైతన్య కథనాయకుడైన ఈ చిత్రంలో మాధవన్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ మధ్యకాలంలో హీరోలుగా నటించిన కథానాయకులు విలన్ గా అవతారాన్ని ఎత్తుతున్న సమయంలో మాధవన్ కూడా తనకు అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అట్టిపట్టుకున్నాడు. ఇంతవరకూ చేయని పాత్రగా తన విలన్ పాత్ర వుంటుందని మాధవన్ అభిప్రాయపడుతున్నాడు.

తాను ఎవరనే విషయం హీరోకి తెలియకుండా కూల్ గా హీరోను టెన్షన్ పెట్టించే పాత్రలో మాధవన్ కనిపించనున్నాడని అంటున్నారు. చైతూ అక్క అయిన భూమికపై పగ బట్టిన మాధవన్, ఆమె కూతురు (నిధి అగర్వాల్)ను కిడ్నాప్ చేసి, చైతూను పరుగులు పెట్టిస్తాడని అంటున్నారు. ఇలా కథ ఉత్కంఠను రేకెత్తిస్తూ కొనసాగుతుందనీ .. చైతూ ఖాతాలోకి మరో హిట్ చేరడం ఖాయమని చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhoomika  chandoo mundeti  madhavan  nagachaitanya  savyasachi  telugu cinema  tollywood  entertainment  tollywood  

Other Articles