NTR birthday: double treat is guaranteed బర్తడేకు డబుల్ ధమాకాతో యంగ్ టైగర్ రెడీ..

Ntr to give double dhamaka birthday gift to fans

young tiger, NTR, Junior ntr, trivikram srinivas, ss rajamouli, tarak, ntr bithday, junior ntr double dhamaka, ntr double treat, mahesh koneru, tollywood

tollywood young tiger tarak mostly known as junior ntr is ready with double dhamaka gifts to his fans on his birthday. One out of this is from Trivikram and another is from rajamouli movie.

బర్తడేకు డబుల్ ధమాకాతో యంగ్ టైగర్ రెడీ..

Posted: 05/16/2018 03:10 PM IST
Ntr to give double dhamaka birthday gift to fans

తెలుగు చిత్రసీమలో అగ్రహీరోల బర్త్ డే అంటే అభిమానులకు పండగే. ఎందుకంటే వారు నటించబోయే తదుపడి ప్రాజెక్టులకు సంబంధించిన టీజర్లు, పస్ట్ లుక్ సహా అనేక విషయాలపై క్లారిటీ వచ్చేస్తుంది. అదే తరహలో నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయన జన్మదినం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటారా.? ఆయన పుట్టిన రోజు మరికొన్ని రోజుల్లోనే వుందికాబట్టి. ఇక అందునా.. తారక్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. దీంతో తమ అభిమాన హీరో డబుల్ ధమాకా ఇస్తాడని కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ నెల (మే) 20న ఎన్టీఆర్ జన్మదిన ట్రీట్ ఎలా వుండబోతుందని అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కేవలం సింగిల్ ట్రీట్ మాత్రమేనని వార్తలు వస్తున్నందున.. సింగిలా..? లేక డబులా.? అంటూ అభిమానుల్లో ఉత్కంఠ రేగుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి సంబంధించి మాత్రం ట్రీట్ వుండబోతుందన్న సమాచారం ఇప్పటికే అభిమానులకు అందింది. యాక్షన్ నేపథ్యమున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బాగా వర్కవుట్ చేసి చాలా శరీరబరువును కోల్పోయారు.

అయితే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఉంటుందట. ఈ విషయాన్ని మహేష్ కోనేరు కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ బర్త్ డే గురించి చాలా యాంక్సైటీగా ఉన్నారు. కాబట్టి అందరికీ నేను చెబుతున్నా. మిమ్మల్ని అయితే నిరుత్సాహ పరచం. ఓ పక్క దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ నేను రివీల్ చెయ్యను. కానీ మీకోసం ఆరోజు సమ్‌థింగ్ స్పెషల్ మాత్రం వెయిట్ చేస్తోంది’’ అంటూ మహేష్ వెల్లడించారు.

మరోవైపు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి కూడా యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా జక్కన్న ఓ సర్ ప్రైజ్ ను ఇవ్వనున్నారని సమాచారం. ఏదిఏమైనా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ అందుతుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr NTR  trivikram srinivas  ss rajamouli  bithday treat  double dhamaka  mahesh koneru  tollywood  

Other Articles