Rangasthalam joins Rs 200 Cr Club రూ. 200 కోట్ల క్లబ్ లో 'రంగస్థలం'.. ఆల్ టైమ్ ధర్డ్..!

Ram charan s rangasthalam enters 200 crore club

ram charan, samantha, sukumar, mythri movie makers, Rs.200 crore club, rangasthalam poster, rangasthalam collection, Rangasthalam, movies, tollywood, entertainment

Rangasthalam which is already in the all time top three grosser in Telugu Film Industry, has joined Rs 200 Cr gross club. Ram Charan starrer village based drama Rangasthalam, directed by Sukumar, was released on 30th March

రూ. 200 కోట్ల క్లబ్ లో 'రంగస్థలం'.. ఆల్ టైమ్ ధర్డ్..!

Posted: 05/01/2018 03:38 PM IST
Ram charan s rangasthalam enters 200 crore club

రంగ రంగ రంగస్థలానా అటబొమ్మలం అంటా మనమంతా.. తొలుబోమ్మలం అంటా అంటూ.. వేదాంతాన్ని పాట రూపంలో చెప్పి.. గ్రామీణ నేపథ్యంలో సాగిన రంగస్థలం సినిమాను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే అల్ టైమ్ ధర్డ్ స్థానానికి తీసుకెళ్లింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం.. నాన్ బాహుబలి చిత్రాల జాబితాలో ఇప్పటికే టాప్ స్థానంలో నిలిచింది. అయితే తాజాగా సుకుమార్ దర్శకత్వంతో రూపోందించబడిన ఈ చిత్రం.. రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.

అంటే అక్షరాల రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి.. మరింత ముందుకు కొనసాగుతూ వసూళ్లను రాబడుతూనే వుంది. ఈ మేరకు ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. మే డే శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఆ పోస్టర్లో రంగస్థలం రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్టుగా పేర్కొన్నారు. టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ థర్డ్ హయ్యెస్ట్ గా తమ చిత్రం సాధించిన వసూళ్లు నిలుస్తాయని తెలిపింది.

టాలీవుడ్ చరిత్రంలో బాహుబలి 2 వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో వుండగా, బాహుబలి రెండోస్థానంలో ఉందన్న విషయం పాఠకులకు తెలిసిందే. అయితే నాన్ బాహుబలి చిత్రాలలో చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రం నిలువగా, దానిని కూడా అధిగమించిన రంగస్థలం టాప్ పోజిషన్ లోకి వెళ్లింది. అయితే తాజా కలెక్షన్లతో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం ఇక అల్ టైమ్ థర్డ్ గా నిలించింది. మార్చి 30వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్‌తో, మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  samantha  sukumar  mythri movie makers  Rs.200 crore club  movies  tollywood  entertainment  

Other Articles