Balakrishna To Direct NTR Biopic ఎన్టీఆర్ బయోపిక్ కు బాలయ్య మెగాఫోన్.?

Balakrishna to direct ntr biopic

Balakrishna To Direct NTR Biopic, Teja quits from NTR biopic, Balakrishna turns director for NTR, Balakrishna, Megaphone, Direction, NTR Biopic, Teja, tollywood, movies, entertainment

After Teja opted out of NTR biopic, none other than Nandamuri Balakrishna is expected to take over the reigns. Balakrishna himself will be wielding the megaphone and the talks are in nascent phase.

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి దర్శకత్వ బాధ్యత..?

Posted: 04/28/2018 05:13 PM IST
Balakrishna to direct ntr biopic

తండ్రి బాటలో తనయుడు నడిస్తే ఆ ఆనందమే వేరు. దివంగత ముఖ్యమంత్రి, పేదల పెన్నిది, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించిన ఇప్పుడు ఆ అనందాన్నే పోందాలని భావిస్తున్నాడట నందమూరి వారసుడు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే తాను కూడా దర్శకత్వ బాద్యతలను చేపట్టానున్నారన్న టాక్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ చిత్రానికి బ్రహ్మతేజ ప్రోడక్షన్స్ పేరుతో నిర్మాణ బాధ్యతలను చేపట్టిన బాలకృష్ణ.. ఇక మెగాఫోన్ ను కూడా పట్టాలని యోచిస్తున్నారన్న వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ చిత్రానికి ఎన్టీఆర్ అభిమాని అయిన తేజకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించినా.. ఆయన తాను ఈ చిత్రానికి న్యాయం చేయలేనేమోనన్న అందోళనతో దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది అనుకుంటుండగా... తేజ తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, వైవీయస్ చౌదరి, క్రిష్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పుడు కొత్త పుకారు ఒకటి వైరల్ అవుతోంది. బాలయ్యే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారనేదే ఆ పుకారు. ఈ వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.

అయితే ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందని బాలయ్య ఆలోచిస్తున్నారట. మెగా ఫోన్ పట్టుకోవాలని గతంలోనే బాలయ్య భావించారు. 'నర్తనశాల' సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే, ఆ సినిమాలో ద్రౌపదిగా అనుకున్న సౌందర్య చనిపోవడంతో... ఆ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు 'ఎన్టీఆర్' చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని బాలయ్య అనుకుంటున్నారన్న వార్తలో ఎంత వరకు నిజం ఉందో రానున్న రోజుల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Megaphone  Direction  NTR Biopic  Teja  tollywood  movies  entertainment  

Other Articles