Actor Rajpal Yadav sentenced to 6 months jail కటకటాల వెనక్కు బాలీవుడ్ కమేడియన్..

Comedian rajpal yadav sentenced to 6 months jail by delhi court

Rajpal Yadav, actor sent to jail, Karkardooma Court, Rajpal Yadav Jail, cheque bounce case, rajpal yadav six months jail, rajpal yadav acquitted, fraud loan cases

Bollywood actor Rajpal Yadav was today awarded six-month imprisonment by a Delhi court in seven cheque bounce cases for not repaying loan worth over Rs 8 crore to a businessman.

కటకటాల వెనక్కు బాలీవుడ్ కమేడియన్..

Posted: 04/24/2018 12:51 PM IST
Comedian rajpal yadav sentenced to 6 months jail by delhi court

ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌ పాల్‌ యాదవ్‌ కు ఢిల్లీలోని న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అతనితో పాటు అతని భార్యను, అతినికి చెందిన ఓ కంపెనీని కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కమేడియన్ రాజ్ పాల్ యాదవ్ తో పాటు అతని భార్యకు కూడా న్యాయస్థానం అరు మాసాల జైలు శిక్షను విధించాలని తీర్పు వెలువరించింది. కాగా, ఈ తీర్పు నేపథ్యంలో న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ వేసుకున్న నటుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎంజీ అగర్వాల్‌ నుంచి తన తొలి హిందీ చిత్రం ‘అతా పతా లప‌తా’ కోసం 2010లో రాజ్ పాల్ యాదవ్ 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 2012లో చిత్రాన్ని విడుదల చేసిన తరువాత కూడా ఆయన తీసుకున్న రుణాన్ని మాత్రం చెల్లించలేదు. దీంతో తన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో వ్యాపారవేత్త అగర్వాల్ ఢిల్లీలోని కర్ కర్ డుమా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.  ఈ కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు న్యాయస్థానానికి కూడా రాజ్ పాల్ హాజరుకాకపోవడంతో గతంలో పది రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి కూడా న్యాయస్థానం పంపింది.

కాగా, దీనిని విచారించిన న్యాయస్థానం రాజ్ పాల్ ను దోషిగా తేల్చి, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. అతనితో పాటు అతని భార్యను, వారికి చెందిన ఓ కంపెనీని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అయితే కేసు తీర్పు నేపథ్యంలో తన తరపు న్యాయవాదులతో బెయిల్ కి దరఖాస్తు చేసుకోగా, రాజ్ పాల్ కు వెంటనే మంజూరైంది. కాగా, రాజ్ పాల్ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను న్యాయస్తానం తీర్పును గౌరవిస్తానని, అయితే ఈ తీర్పును తాను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles