actress Anjali's transformation shocks everyone అంజలి రొట్టే విరిగి నేతిలో పడిందా..?

Bubbly actress anjali s transformation shocks everyone

actress anjali, anjali in gym, anjali new look, anjali slim look, celebrities, movies, Rajinikanth, kollywood, Tollywood, movies, entertainment

Beautiful actress Anjali looks so much lean, sexier and younger. And she was never so hot before. That is a lot of carbs that she burnt as you can see.

అంజలి రొట్టే విరిగి నేతిలో పడిందా..?

Posted: 04/03/2018 07:12 PM IST
Bubbly actress anjali s transformation shocks everyone

పదహారణాల తెలుగమ్మాయి అని చెప్పడమే కానీ అలాంటి అమ్మాయి చిత్రసీమలో ఎవరైనా వున్నారా..? అంటే సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు చిత్రం చూసిన తరువాత అందరూ అంజలిని చూసి మనమ్మాయే అని అన్నారు. అమెను పోల్చారు. ఆకట్టుకునే ముఖారవిందం.. అమె చిరుదరహాసం యువతను మంత్రముగ్ధుల్ని చేస్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటు తెలుగుతో పాటు అటు తమిళం, కన్నడ చిత్రసీమల్లో కూడా రాణిస్తున్న ఏకంగా 30 చిత్రాలకు పైగా నటించిన ఈ అమ్ముడు.. ఆ మధ్య కాసింత లావెక్కింది.

అయితే ఈ అమ్మడుకు ఒక సూపర్ స్టార్ తో బంఫర్ ఆఫర్ వచ్చింది. అయితే కండీషన్ అప్లై అన్నట్లు బరువు తగ్గించుకోవాలని కూడా దర్శకుడు సూచించారట. దీంతో ఇప్పటివరకు వచ్చిన అన్నిచిత్రాలలో ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ వచ్చిన అంజలి ఏకంగా సన్నబడింది. తాజాగా కనిపిస్తున్న అంజలిని చూస్తే ఇన్నాళ్లు మనం చూసింది ఈ అమ్మడునేనా.? అన్న సందేహాలు కలగకమానవు. ఎందుకంటారా.. ఇప్పుడు మీరు చూసే అంజలి ఎంతో అకర్షినీయంగా, అందంగా, మరింత యవ్వనంగా, చురుకుగా తయారై కత్తి లాంటి అమ్మాయి అన్న నానుడికి సరిగ్గా సరిపోయేలా తయారైంది.

ఇందుకోసం అమె గత కొన్ని రోజులుగా జిమ్ లో తెగ వర్కవుట్లు చేస్తోంది. అందుకు కారణం...కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం కోసమే ఆమె ఇలా నాజూగ్గా తయారవుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చిత్రాంగద, డిక్టేటర్, శంకరాభరణం, బలుపు, జర్నీ, షాపింగ్ మాల్ చిత్రాలతో నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అయితే ప్రతి సినిమాలోనూ ఆమె బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress anjali  Rajinikanth  kollywood  Tollywood  movies  entertainment  viral videos  

Other Articles