NTR Biopic launched in grand manne అట్టహాసంగా ఎన్టీయార్ బయోపిక్.. క్లాప్ కోట్టిన వెంకయ్య

Venkaiah naidu kick start balakrishna ntr biopic film shoot

NTR biopic, NT RamaRao, Bala krishna, venkaiah naidu, Teja, Tollywood,NTR biopic launch,NTR biopic launch live streaming,NTR biopic launch live on Youtube,President M Venkaiah Naidu,NTR biopic launch chief guest,Nandamuri Balakrishna,NT Rama Rao biopic,NTR biopic opening ceremonyTollywood

Vice-president M Venkaiah Naidu launched the shooting of Nandamuri Balakrishna starrer biopic on his late father, late legendary actor NT Rama Rao aka NTR at a ceremony

అట్టహాసంగా ప్రారంభమైన ఎన్టీయార్ బయోపిక్.. క్లాప్ కోట్టిన వెంకయ్య

Posted: 03/29/2018 11:39 AM IST
Venkaiah naidu kick start balakrishna ntr biopic film shoot

దివంగత మహానేత, రాముడు, కృష్ణుడిగా ఇప్పటికీ తెలుగురాష్ట్ర ప్రజల అరాధనను పొందుతున్న ఎన్టీ రామారావు బయోపిక్ ను ఆయన తనయుడు, నందమూరి బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంతో తెరకెక్కే 'ఎన్టీఆర్' చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ముహూర్తపు షాట్ గా, ఎన్టీఆర్ కెరీర్ లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'దాన వీర శూర కర్ణ' ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. 1976లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీ రామచంద్రన్ ప్రత్యేక అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా, ఎంజీఆర్ వేషం వేసుకున్న నటుడు వచ్చి క్లాప్ కొట్టగా, దుర్యోధనుడి వేషంలో ఉన్న బాలయ్య, తన మీసం మెలేస్తూ, డైలాగ్ చెప్పుకుంటూ వెళ్లారు.

కాగా ఈ చిత్రం షూటింగ్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టి ప్రారంభింగా, దర్శకుడు బోయపాటి తొలి షాక్ కు దర్శకత్వం వహించాడు. ప్రత్యేకంగా వేసిన 'దాన వీర శూర కర్ణ' సినిమా సెట్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తొలి దృశ్యంగా కర్ణుడిని రాజ్యాభిషిక్తుడను చేసే సీన్ ను చిత్రీకరించగా, కోట శ్రీనివాసరావు దృతరాష్ట్రుడి పాత్రలో కనిపించగా, జీవి తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించారు. "ఓహో... రాచరికమా అర్హతను నిర్ణయించునది. సోదరా దుశ్శాసనా... మామా గాంధార సార్వభౌమా... పరిజనులారా... పుణ్యాంగనులారా" అన్న సూపర్ హిట్ డైలాగును తనదైన శైలిలో చెప్పారు.

ఈ చిత్రం ముహూర్తపు షాట్ కోసం బాలకృష్ణ దుర్యోధనుడి వేషంలో షూటింగ్ స్పాట్ కు వచ్చారు. కిరీటం లేని మేకప్ తో వచ్చిన ఆయన, చుట్టూ తెల్లని శాలువా కప్పుకున్నప్పటికీ, ఆయన మేకప్ ను నిజంగా ఎన్టీయార్ ఈ వేశాన్ని మళ్లీ వేసుకున్నారా..? అన్నంతలా కనిపించారు. ఇక తొలి షాట్ డైలాగ్, ఎన్టీఆర్ సినిమాల్లోనే అత్యంత ఫేమస్ అయిన దాన వీర శూర కర్ణ లోని "ఏమంటివి ఏమంటివి..." అన్న డైలాగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేసిన దసరా పండగ పర్వదినం నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తేజ అన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అల్లు అరవింద్, హీరో రాజశేఖర్ తో పాటు అంబికా కృష్ణ తదితరులు హాజరై బాలకృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా సినిమా ప్రారంభోత్సవాలకు సాధారణంగా తాను కానీ, లేక ఉపరాష్ట్రపతి స్థానంలో వున్నవాళ్లు కానీ హజరుకారని, అయితే ఎన్టీఆర్ పై తనకున్న అభిమానంతోనే తాను ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యానని చెప్పారు. ఎన్టీఆర్ అటు నటుడిగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా చరిత్రను సృష్టించి, దాన్ని తిరగరాసిన వ్యక్తని చెప్పడంలో అతిశయోక్తి లేదని అన్నారు.

అటువంటి వ్యక్తి జీవితగాధను, ఆయన కుమారుడే తెరకెక్కించేందుకు ముందుకు రావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. తానెంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నానని, ఇక్కడి నుంచి పుణె వెళ్లి, తిరిగి హైదరాబాద్ కు రావాల్సి వుందని చెప్పిన ఆయన, అయినా ఎన్టీయార్ పై తనకున్న అభిమానమే ఈ చిత్ర ప్రారంబోత్సవానికి హాజరయ్యేలా చేసిందన్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రావడం తన మనసుకు ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. మనమంతా తెలుగులో మాట్లాడి, తెలుగును ప్రోత్సహించడం ద్వారానే రామారావుకు నిజమైన నివాళిని తెలిపిన వారమవుతామని వెంకయ్యనాయుడు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR biopic  NT RamaRao  Bala krishna  venkaiah naidu  Teja  Tollywood  

Other Articles