Veteran Actress Suffering from Acute Asthma, hospitalised ఆసుపత్రిలో సీనియర్ నటి.. పరిస్థితి విషమం..

Veteran south indian actress jayanthi hospitalised in critical condition

mgr, MG Ramachandran, Krishna Kumar, kannada, Jayanthi, Asthama, Vikram hospital, son Krishna kumar, Dr Rajkumar, sandal wood, kollywood, tollywood, mollywood

Senior actress Jayanthi has been admitted to a private hospital, after complaining of breathing difficulties. The health of the actress, who is suspected to be suffering from asthma, is being monitored in the hospital's Intensive Care Unit, and she has been put on a ventilator.

ఆసుపత్రిలో సీనియర్ నటి.. పరిస్థితి విషమం..

Posted: 03/27/2018 02:13 PM IST
Veteran south indian actress jayanthi hospitalised in critical condition

సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరులోని స్వీడన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచనల మేరకు ఆమెను కన్నింగ్ హామ్ రోడ్ లోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించినట్టు ఆమె కుమారుడు కృష్ణ కుమార్ తెలిపారు. అప్పటి నుంచి ఆమె అబ్జర్వేషన్‌లో వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు ఐసీయూలోనే చికిత్సను అందిస్తున్నారు. కాగా అప్పుడే అమె పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని చెబుతన్నా.. జయంతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న ఆమె.. ఎప్పుడూ ఇన్‌హేలర్ తో ఉపశమనం పొందేవారు తప్ప హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన దాఖలాలు లేవని సమాచారం. అయితే ప్రస్తుతం అమె శరీరం చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తుంది.  1949, జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి.. దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించిన మెప్పించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు. తెలుగులో చాలా మంది అగ్ర హీరోలకు తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : veteran Actress  kannada  Jayanthi  Asthama  Vikram hospital  sandal wood  tollywood  

Other Articles