Jhanvi Birthday Celebrations After Sridevi Demise | శ్రీదేవి పక్కన లేకుండానే జాన్వీ బర్త్ డే.. ఎలా గడిచిందంటే...

Jhanvi kapoor 21st birthday celebrations

Jhanvi Kapoor, Birthday Celebrations, Old Age Home, Kapoor Sisiter Jhanvi Birthday Celebrations, Jhanvi Without Sridevi

Jhanvi Kapoor Celebrates her 21st Birthday in An Old Age Home. Later Family Members Arrange Small Party. Sonam Kapoor Posted Jhanvi Birthday Celebrations Photo.

వృద్ధాశ్రమంలో బర్త్ డే వేడుకలు జరుపుకున్న జాన్వీ

Posted: 03/07/2018 12:30 PM IST
Jhanvi kapoor 21st birthday celebrations

న‌టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ త‌న 21 వ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ముంబైలోని వృద్ధాశ్ర‌మంలో జ‌రుపుకుంది. శ్రీదేవి లేకుండా ఎప్పుడు త‌న బ‌ర్త్‌డే జ‌రుపుకోని జాన్వీ.. తల్లి హఠాన్మరణంతో తొలిసారి త‌న త‌ల్లి లేకుండా కేక్ క‌ట్ చేసింది. చిన్నారులు, యువతులతోపాటు వృద్ధ మ‌హిళ‌ల మధ్య బ‌ర్త్ డే సాంగ్ పాడ‌గా, ఆ త‌ర్వాత జాన్వీ కేక్ క‌ట్ చేసింది.

ఆ తర్వాత బోనీ కపూర్ ప్రోద్భలంతో కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి డిన్నర్ లో పాల్గొంది. క‌జిన్ సోన‌మ్ క‌పూర్ కపూర్ స్టిస్టర్స్ అంటూ ఓ ఫోటోను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో సోన‌మ్‌, రియా, అన్షుల‌, ష‌ణ‌య‌, ఖుషీ త‌దిత‌రులు ఉన్నారు. బోనీ త‌న కూతురు ప‌క్క‌నే ఉండి కేక్ క‌ట్ చేయించ‌డం విశేషం. జాన్వీ బ‌ర్త్ డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోల‌ని సంజ‌య్ క‌పూర్‌, సోన‌మ్‌, రియా లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఇవి వైర‌ల్‌గా మారాయి.

గ‌త ఏడాది జాన్వీ బ‌ర్త్ డే కోసం శ్రీదేవి ఫ్యామిలీ మొత్తం విదేశాల‌కి వెళ్ళిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ వారు చేసిన సంద‌డికి సంబంధించిన ఫోటోల‌ని అతిలోక‌సుందరి త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసి ఫ్యాన్స్‌లో ఫుల్ హ్యాపీనెస్ క‌లిగించింది. ఈ సారి కూడా జాన్వీ బ‌ర్త్‌డే షాపింగ్ కోస‌మనే కజిన్‌ పెళ్ళి త‌ర్వాత రెండు రోజులు దుబాయ్‌లో ఉంది శ్రీదేవి. కాని విధి వైప‌రిత్యం శ్రీదేవి అనంత‌లోకాల‌కి వెళ్ళేలా చేసింది. ప్రస్తుతం జాన్వి ‘ధడక్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles