Impact of T Celebrities Message against Cyber Crimes | సైబర్ క్రైమ్ షార్ట్ ఫిల్మ్స్.. సెలబ్రిటీల సందేశాల ప్రభావం ఎంతంటే...

Good response to tollywood celebrities short films

Tollywood Celebrities, Cyber Crimes, Hyderabad City Police, Awareness, NTR, Rajamouli, Vijay Devarakonda, Siddarth Nikhil, Short Films

Hyderabad City Police Short Films Against Cyber Crimes by Tollywood Celebrities. Jr NTR, Rajamouli , Vijaya Devarakonda and Siddarth Nikhil Messages well response by People.

టాలీవుడ్ సెలబ్రిటీల లఘు చిత్రాలకు మంచి స్పందన

Posted: 02/21/2018 02:09 PM IST
Good response to tollywood celebrities short films

సందేశాలు మాములుగా చెప్పించటం కంటే సెలబ్రిటీలతో చెప్పిస్తే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ నగర పోలీసు శాఖ తాము చేపట్టిన అవేర్‌నెస్ కాంపెయిన్లో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో మొత్తం 5 లఘు చిత్రాలు రూపొందాయి. సైబర్ నేరాలు..ప్రజల్లో అవగాహన పేరిట సోమవారం విడుదల చేశారు. ఐదు లఘు చిత్రాలకు రాజమౌళి దర్శకత్వం వహించటం విశేషం.

వీటిలో ఓ లఘు చిత్రంలో రాజమౌళి స్వయంగా నటించటం విశేషం. బ్యాకింగ్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అంశాలపై ఆయన ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మరో షార్ట్ ఫిలింలో విజయ్ దేవరకొండ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ పెళ్లి సంబంధాల విషయంలో చాలా మంది మోస పోతున్నారు. కక్కుర్తి పడకండి.. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకు వెళ్లండి అంటూ సందేశం ఇచ్చాడు. ఇక గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ హీరో ఎన్టీఆర్ తో ఓ షార్ట్ ఫిల్మ్ ను తీసి విడుదల చేశారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు సంబంధించిన అంశంపై అవగాహన కల్పించేందుకు చిత్రీకరించిన ఫిల్మ్ లో హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించాడు.

ఫేస్ బుక్ ఫ్రెండ్ నుంచి ఓ యువతికి ఎదురైన అనుభవాన్ని ఇందులో చూపించారు. చివర్లో ఎన్టీఆర్ "వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయకండి. తగు జాగ్రత్తలను వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్‌ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ కు రిపోర్ట్ చేయండి... జాగ్రత్త" అని సందేశం ఇవ్వడంతో ఈ లఘుచిత్రం ముగుస్తుంది. వీటితోపాటు మరో షార్ట్ ఫిలింను కూడా రూపొందించారు. ఈ లఘు చిత్రాను థియేటర్లలో నిన్నటి నుంచి ప్రదర్శిస్తుండగా, దాన్నే సోషల్ మీడియాలో సైతం పోలీసులు విడుదల చేశారు. ప్రజల నుంచి వీటికి మంచి స్పందన లభిస్తుంది. సెలబ్రిటీలు ఇలా స్వచ్చందంగా ముందుకొచ్చి అవగాహన కార్యక్రమంలో పాల్గొనటం మంచి పరిణామంగా వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్నింటిని రూపొందించాలని నగర పోలీస్ శాఖ యోచిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles