Rana not Attend Satya Gang Audio Event | నన్నెవ్వరూ పిలవలేదు.. నాకేమీ తెలీదు కూడా...

Rana daggubati condemns rumour

Nandamuri Balakrishna, Rana Daggubati, Satya Gang Audio, Satya Gang Rana Balayya, Rana on Fake News

Tollywood stars Nandamuri Balakrishna and Rana Daggubati will be attending the audio launch event of a small budget film titled Satya Gang. But Rana Condemns the rumour.

ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు : రానా

Posted: 02/16/2018 06:31 PM IST
Rana daggubati condemns rumour

సోషల్ మీడియాలో చెలరేగే పుకారు.. దాని పట్టుకునే కొన్ని వెబ్ సైట్లు రాసే వార్తలు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు సెలబ్రిటీలు మాత్రం వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. తాజాగా దగ్గుబాటి రానా కూడా అదే పని చేశారు.

సాత్విక్ ఈశ్వ‌ర్‌, ప్ర‌త్యూష్‌, హ‌ర్షిత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప్ర‌భాస్ అనే కొత్త దర్శకుడు స‌త్య గ్యాంగ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం ప్రమోషన్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వినిపించాయి. అందులో భాగంగా శుక్రవారం జరగబోయే ఆడియో వేడుక‌కి రానా, నంద‌మూరి బాల‌కృష్ణ హాజరవుతారని, వారి చేతుల మీదుగా విడుద‌ల చేయ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆటోమేటిక్ గా సినిమా గురించి ఆరాలు తీయటం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో రానా తన ట్విట్టర్ లో స్పందించాడు. అది నిజం కాదు. స‌త్య గ్యాంగ్ యూనిట్‌కి సంబంధించి తనని ఎవరూ సంప్ర‌దించ‌లేదని, కనీసం ఇన్వైట్ కూడా చేయ‌లేద‌ని ట్వీట్ చేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles