No Buyers for Kaala Telugu Version | రజనీ సినిమాకు ఇదేం పరిస్థితి.. భయపడుతున్న బయ్యర్లు

No buyers interest for kaala movie

Rajinikanth, Kaala Movie, Kaala Buyers, Kaala Telugu Business, Kaala Movie, Kaala Producer Dhanush, Kaala Dil Raju, Kaala Telugu Rights

No Buyers ready to buy Rajinikanth Kaala telugu rights. Producer Dhanush discuss with Dil Raju and Chadalavada Brothers for Telugu Market.

కాలాకు తెలుగులో బయ్యర్లు కరువు

Posted: 02/16/2018 05:16 PM IST
No buyers interest for kaala movie

కబాలి సినిమా ఓ ఇండియన్ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది. చాకెట్ల దగ్గరి నుంచి ఫ్లైట్ ల దాకా అన్నింటిపైనా రజనీ మేనియా కనిపించింది. అలాంటిది రజనీ చిత్రం విడుదలవుతుందంటే.. బిజినెస్ ఎలా ఉండాలి. తమిళ్ లోనే కాదు.. తెలుగులోనూ రజనీ చిత్రానికి భారీ ఎత్తులో బిజినెస్ జరుగుతుంది.

అంతెందుకు శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన '2.0'కు తెలుగు డబ్బింగ్ హక్కులను ఆసియన్ ఫిల్మ్స్ రూ. 90 కోట్ల భారీ మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటిది కాలా విషయంలోనే సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. కాలా ఏప్రిల్ 27న విడుదల అవుతోంది. అదే సమయంలో మహేష్, బన్నీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదని సమాచారం. దీనికి తోడు కబాలి మిగిల్చిన నష్టాలు వారిని భయపెడుతున్నాయి.

సాధారణంగా తలైవా సినిమా అంటే దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఫ్యాన్సీ రేటు పెట్టి హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఆయన కొత్త చిత్రం 'కాలా' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్న నిర్మాత, రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా రంగంలోకి దిగి దిల్ రాజు, చదలవాడ సోదరులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaala Movie  Rajinikanth  Telugu Rights  

Other Articles