Here is RGV Brand New Hero after Shiva | గతాన్ని గుర్తు చేసుకున్న నాగ్, వర్మ

Varma nag reminds shiva days

Nagarjuna Akkineni, Ram Gopal Varma, NagRGV4, RGV, Varma Nag, Nag Varma Shiva Days

Nagarjuna and Ram Gopal Varma reminds Shiva Movie Opening Days. Varma praise Nag as Brand New Hero, and Nag Happy with Action Episodes.

గతాన్ని గుర్తు చేసుకున్న నాగ్, వర్మ

Posted: 02/16/2018 04:28 PM IST
Varma nag reminds shiva days

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను టాలీవుడ్ కు పరిచయం చేసిన శివకు.. ఈ రోజు అంటే ఫిబ్రవరి 16కు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే ‘శివ’ తొలి రోజు షూటింగ్ జరిగింది ఈరోజే. ఈ విషయం చెబుతూ ఉదయమే దర్శకుడు వర్మ తన ట్విట్టర్ లో ఓ సందేశం ఉంచాడు.

నా బ్రాండ్ న్యూ హీరో అంటూ నాగ్ పోస్టర్ ను పోస్టు చేసిన ఆర్జీవీ.. దాదాపు పాతికేళ్ల తర్వాత నాగార్జున అనే కొత్త నటుడిని కనుగొన్నానని... మునుపెన్నడూ చూడని రీతిలో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు అంటూ మరో పోస్టర్ ను ఉంచాడు. ఇక హీరో నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు.

ఫిబ్రవరి 16 1989..29 సంవత్సరాల క్రితం ఇదే రోజున సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన, కొత్త ఆలోచనా దృక్పథానికి నాంది పలికిన ‘శివ’ చిత్రం ప్రారంభించామని, నాగ్-వర్మ కాంబినేషన్ లో వచ్చే మరో చిత్రంతో రాక్ చేసే సమయం ఆసన్నమైందని నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్మ-నాగ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రం స్టిల్స్ ను నాగార్జున పోస్ట్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  RGV  

Other Articles