Anushka Sharma looks terrifying in Pari Trailer | పరి ట్రైలర్.. హర్రర్ సీన్లతో వణికించిన అనుష్క

Anushka pari trailer out

Anushka Sharma, Pari Movie, Pari Movie Trailer, Pari Trailer, Anushka Pari Trailer, Virat Kohli Pari Trailer, Pari Horrific Movie

The trailer of Anushka Sharma‘s Holi release Pari. Living true to its promise, this film certainly does not seem for the faint-hearted and we had our moments of goosebumps too! One moment, Anushka looks innocent as a child, the other moment she has expressions that will send shivers down your spine. And the trailer will not let you forget even for a moment that unlike the name suggests, this film will not be a fairytale.

పరి ట్రైలర్.. వణికించిన అనుష్క

Posted: 02/15/2018 04:34 PM IST
Anushka pari trailer out

అనుష్క శర్మ నటిగానే కాదు నిర్మాతగానూ ఇప్పుడు బిజీ అయిపోయింది. ఎన్ హెచ్ 10, ఫిల్లౌరి మూవీ ల‌కు నిర్మాతగా వ్యవహరించి అందులో నటించింది కూడా. తాజాగా పరి చిత్రంతో మరోసారి మన ముందుకు రాబోతోంది.

ప్రోసిత్ రాయ్‌ డైరెక్షన్ లో పరి తెరకెక్కింది. ప‌రంభ్ర‌త చ‌ట‌ర్జీ, రజ‌త్ క‌పూర్, రిత‌బ్ర‌య్ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 2న విడుద‌ల కానుంది. హ‌ర‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో స్పెష‌ల్ ఎఫెక్ట్ ఉంటాయ‌ని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. దెయ్యం పట్టిన ఓ యువతి ఎదుర్కునే సమస్యలు.. దాని వల్ల మిగతా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు.. అసలు దెయ్యాలు ఆమెనే ఎందుకు టార్గెట్ చేశాయి అన్నదే కథ. ఊహించని సన్నివేశాలు.. మలుపులు... కాస్త భయానకంగానే ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. మొత్తానికి సినిమాకు అనుష్క నటనే ఈ చిత్రానికి కీలకం కానుంది.

ఈ చిత్రంతోపాటు శరత్ కఠారియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుయి ధాగాలో కూడా అనుష్క నటిస్తోంది. షారూఖ్ జీరోలో కత్రినాతోపాటు అనుష్క హీరోయిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles