Nithiin 25th Movie Release Date Fixed | నితిన్ @25.. డేట్లు ప్రకటించేశారు

Nithiin 25th movie dates fixed

Nithiin, Nithiin 25th Movie, Nithiin 25th Release Date, Nithiin Next Release Date, Nithiin-Pawan-Trivikram Movie, Krishna Chaitanya Nithiin, Megha Akash Nithiin Second Movie, Nithiin Movie Teaser, Nithiin 25th Movie First look, Nithiin 25th Release Date

Nithiin's 25th movie, produced jointly by Pawan Kalyan Creative Works and Trivikram Srinivas, has been shot since last July, in the US and other locations. Directed by Krishna Chaitanya of Rowdy Fellow fame, it has Megha Akash LIE fame as the heroine. The news is that the movie will hit the screens on April 5. The First Look will be unveiled on Feb 12, while the teaser will be released as V-Day gift on Feb 14. Rao Ramesh, Naresh, Pragati, Lizzy, Narra Srinu, Srinivasa Reddy and Madhu are a part of the cast. While the story is by Trivikram Srinivas, it has music by SS Thaman Nataraj Subramanyan of A Aa fame is the cinematographer.

నితిన్ 25వ చిత్రం తేదీలు ఖరారు

Posted: 02/05/2018 04:11 PM IST
Nithiin 25th movie dates fixed

యంగ్ హీరో నితిన్ 25వ చిత్రం తేదీలు ఖరారు అయ్యాయి. ఫస్ట్ లుక్, టీజర్, మరియు రిలీజ్ తేదీలను ఒకేసారి ప్రకటించేశారు. రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తుండగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా లై బ్యూటీ మేఘా ఆకాశ్ నటిస్తోంది.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఇది ప్రేమకథా చిత్రం కావడం వలన .. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ నెల 14వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాను కూడా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం.. అ..ఆ.. ఫేమ్ నటరాజ్ సుబ్రమణ్యన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.

లై పరాజయంతో డీలాపడిపోయిన నితిన్ ఆ వెంటనే తేరుకుని.. ఈ సినిమా చేస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కావటంతో తనకి ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు. ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles