Now Karni Sena Declares Great Support to Padmaavat | పద్మావత్ అద్భుతమన్న కర్ణిసేన.. మరి ఇన్నాళ్ల లొల్లి మాటేంటో?

Karni sena praise padmaavat

Padmaavat, Sri Rajput Karni Sena, Padmaavat Controversy, Padmaavat Karni Sena Praise, Padmaavat Karni Sena Supports

Sri Rajput Karni Sena withdrawals Protest against Padmaavat Movie. Declares Padmaavat Glory of Rajputs.

పద్మావత్ పై కర్ణిసేన ప్రశంసలు

Posted: 02/03/2018 05:37 PM IST
Karni sena praise padmaavat

పద్మావత్ వివాదంపై శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. షూటింగ్ దశలోనే చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడికి పాల్పడి.. ఆపై సెట్స్ ను సైతం దహనం చేశారు. ఈ కోవలో సినిమా రిలీజ్ ను నెలన్నరకు పైగా అడ్డుకుని.. చివరకు చిత్ర విడుదల సయమంలో తీవ్ర ఆందోళన చేపట్టారు.

ఏదైతేనేం ఎట్టకేలకు చిత్రం విడులైంది. అందులో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని రివ్యూలు, విశ్లేషకులు, ప్రేక్షకులు అంతా తేల్చేశారు. మరోవైపు కలెక్షన్లు పరంగా కూడా చిత్రం దూసుకుపోతోంది. ఈ పరిస్థితులతో కర్ణిసేన వెనక్కి తగ్గింది. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ముంబైలో పలువురు కర్ణిసేన ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. ఆపై ముంబై చీఫ్‌ యోగంద్ర సింగ్‌ కటార్‌ చిత్రానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు కర్ణిసేన జాతీయాధ్యఓుడు సుఖ్ దేవ్ సింగ్ పేరిట ఓ ప్రకటన కూడా విడుదలైంది.

‘‘చిత్రంలో రాజ్ పుత్ లను గొప్పగా చూపించరాని.. అభ్యంతరకర సన్నివేశాలు లేవని... ప్రతీ రాజ్ పుత్ చిత్రాన్ని చూసి గర్వపడతారంటూ ఓ ప్రకటనలో కర్ణిసేన పేర్కొంది. అంతేకాదు మిగతా రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రమోట్ చేస్తామని తెలిపింది. దీంతో కర్ణిసేన యూటర్న్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చి పడుతున్నాయి. అయితే అది వాళ్లు నిజమైన కర్ణిసేన సైనికులు కాదని.. రాజస్థాన్ కు చెందిన వారే అసలైన కర్ణి సేన అంటూ కొందరు ఆ రాష్ట్రంలో మాత్రం చిత్ర విడుదలను ఇంకా అడ్డుకుంటున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles