Prabhas Saaho May Not Release this year | సాహో విడుదలకు అవే అడ్డంకులు

Saaho may not release this year

Prabhas, Saaho Movie, Shradda Kapoor, Director Sujeeth, Saaho Release Postpone, Saaho Release Date

Prabhas And Shraddha Kapoor’s Saaho Will Not Release In 2018 But In Early 2019. Director Sujeeth's Heavy Action Stunts may reason for delay this movie.

సాహో విడుదల.. ఈ ఏడాది కష్టమే!

Posted: 02/02/2018 11:19 AM IST
Saaho may not release this year

సాహో కోసం ప్రభాస్ అభిమానులే కాదు.. ఉత్తరాది ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోచే చిత్రం కాబట్టి. ఆ అంచనాలకు తగ్గట్లే యూవీ క్రియేషన్స్ వాళ్లు భారీ బడ్జెట్ తో మల్టీ లింగువల్ చిత్రంగా సాహోను నిర్మిస్తున్నారు.

గతేడాది చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. ఒకటి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. దీపావళి రిలీజ్ అని మొదట్లో చిత్ర యూనిట్ సంకేతాలు అందించింది. ఆలస్యం కాకూడదన్న ఉద్దేశ్యంతో దర్శకుడు సుజిత్ కూడా షూటింగ్ తోపాటే పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుతున్నాడు. అయినప్పటికీ సినిమా మాత్రం ఆలస్యం కావటం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

చిత్రం కోసం భారీ హంగులు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం విదేశీ స్టంట్ నిపుణులను తెప్పిస్తున్నారు. దీంతో షెడ్యూల్ షెడ్యూల్ కి మధ్య లాంగ్ గ్యాప్ పడుతుంది. పైగా ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ్ లో తెరకెక్కించాలి కాబట్టి అది ఇంకాస్త టైమ్ తీసుకుంటుంది. దీంతో సాహో వచ్చే ఏడాది మొదట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కు కాస్త చేదు వార్తే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles