Mohan Babu Sensational Comments on Politicians | 95 శాతం మంది పొలిటీషియన్లు రాస్కెల్స్

Mohan babu comments on politics

Mohan Babu, India Today South Conclave 2018, Sensational Comments, Mohan Babu Sensational Comments

Senior actor cum politician Mohan Babu has made some sensational comments on the politics. Mohan Babu revealed that the politicians are cheaters and they will never fulfill the promises made to the common men. 95 Percent of the politicians are rascals, and they don’t fulfill the promises made to the people. If they do their duty well, India would have been in a better position. He participated in South Conclave that is happening in Hyderabad.

రాజకీయాలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Posted: 01/19/2018 06:47 PM IST
Mohan babu comments on politics

రాజకీయాలపై నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు ఎన్నో హామీలిస్తున్నార‌ని, కానీ వాటిని నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని, వారు మాట నిలబెట్టుకుంటే భార‌త్ ఇంకా మంచి స్థానంలో ఉండేదని సినీన‌టుడు మోహన్‌బాబు అన్నారు.

95 శాతం మంది పొలిటీషియన్లు రాస్కెల్స్ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ 2018లో పాల్గొన్న మోహ‌న్ బాబు మాట్లాడుతూ... త‌న‌ స్నేహితుడు, తాను అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ మాత్రం చాలా మంచి వ్యక్తని అన్నారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అని.. లంచం అంటే ఏమిటో కూడా ఆయనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. త‌న‌ను రాజ్యసభకు పంపిందని ఎన్టీఆర్ అని.. తాను ఎలాంటి మచ్చ లేకుండా త‌న‌ పదవీ కాలాన్ని పూర్తి చేశానని చెప్పుకొచ్చారు.

ఈ వేదికపై త్వరలో రాజకీయాల్లో రాబోతున్న కమల్, రజనీల గురించి కూడా మోహన్ బాబు ప్రస్తావించారు. ముఖ్యంగా రజనీతో తన అనుబంధం ప్రత్యేకమైందని వెల్లడించారు. సినిమాలు వేరని.. రాజకీయాలు వేరని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. ఇదే వేదికపై తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles