Actresses feud for Chair at Golden Globes Event | కుర్చీ కోసం బూతులు తిట్టుకున్న హీరోయిన్లు

Mariah carey s tweets about stealing mery

Mariah Carey, Meryl Streep, Golden Globes Awards, Mariah Carey Meryl Streep, Jimmy Kimmel

Mariah Carey Stole Meryl Streep's Seat At The Golden Globes. Jokes on "Bitch Stole My Seat!" Statement. Jimmy Kimmel tweeted on that Issue.

అవార్డు వేడుకలో కుర్చీల కోసం కొట్లాట!

Posted: 01/10/2018 01:00 PM IST
Mariah carey s tweets about stealing mery

ఈసారి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక‌ హాలీవుడ్ పరువు తీస్తోంది. సీనియ‌ర్ న‌టీమ‌ణి మెరిల్ స్ట్రీప్‌, పాప్ సింగర్ మ‌రియా కేరీల మ‌ధ్య గోడవ చోటు చేసుకుంది. కుర్చీల కోసమే ఈ రాద్ధాంతం జరిగినట్లు తెలుస్తుండటంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

అవార్డు వేడుక‌ల అనంత‌రం జిమ్మీ కెమ్మెల్ లైవ్ షోలో పాల్గొన్న మెరిల్ ఈ విష‌యం గురించిన సంగ‌తుల‌ను బ‌య‌ట‌పెట్టింది. స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ ద‌గ్గ‌ర కూర్చునేందుకు మరియా అలా చేసిందంటూ మెరిల్ కొన్ని అభ్య ప‌దజాల‌ను కూడా వాడింది. ఈ వీడియోను జిమ్మీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే అనుకోకుండా కూర్చున్నందుకు మ‌రియా, మెరిల్‌కు వ్య‌క్తిగ‌తంగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ట్విట్ట‌ర్‌లో కూడా ఆమె క్ష‌మాప‌ణ‌లు తెలిపింది.

విశ్రాంతి స‌మ‌యంలో తాను బ‌య‌టికి వెళ్లాన‌ని, అప్పుడు ఒక్క‌సారిగా కార్య‌క్ర‌మం ప్రారంభమ‌వుతుంద‌ని ఎక్క‌డి వాళ్లు అక్క‌డే కూర్చోవాల‌ని చెప్పార‌ని, అందుకే ఖాళీగా ఉన్న మెరిల్ సీట్లో కూర్చున్న‌ట్లు మ‌రియా చెప్పింది. ఆ స‌మయంలో అక్క‌డ మెరిల్ లేక‌పోవ‌డం, త‌ర్వాత కాసేప‌టికి అక్క‌డికి రావ‌డంతో చిన్న చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles