Manasuku Nachindi to release on Republic Day | సాఫ్ట్ లవ్ స్టోరీ.. హీరకు హిట్ వస్తుందా?

Manasuku nachindi release date

Manasuku Nachindi, Actor Sundeep Kishan, Manjula Ghattamaneni, Amyra Dastur, Manasuku Nachindi Release Date

‘Manasuku Nachindi’ the Manjula Ghattamaneni directorial will be releasing on January 26. Having made an impact already with its teaser and songs, 'Manasuku Nachindi' will clash in the box office with other three Telugu releases.

మనసుకు నచ్చింది రీలీజ్ డేట్ చెప్పేశారు

Posted: 01/05/2018 04:49 PM IST
Manasuku nachindi release date

నటుడు కృష్ణ తనయ మంజుల ప్రస్తుతం డైరెక్షన్ విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలె రిలీజ్ అయిన ఆ టీజర్ కు మంచి స్పందన కూడా లభించింది. అయితే ఈ చిత్ర విడుదల విషయంలోనే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లవ్ స్టోరీ కావటంతో తొలుత ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయటానికి మొగ్గు చూపారు. అయితే ఆ సమయంలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, మరో రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. దీంతో రిలీజ్ ను ప్రీ పోన్ చేసేశారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, త్రిదా చౌదరి కీలకమైన పాత్రను పోషించింది. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మంజుల కూతురు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.

ఓవైపు తెలుగుతోపాటు తమిళ భాషల్లో వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంపిక చేసుకుంటూ, సందీప్ కిషన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అయితే హిట్లు మాత్రం పడటం లేదు. ఈ నేపథ్యంలో మంజుల సినిమాతోనైనా సందీప్ కెరీర్ గాడిన పడుతుందేమో చూడాలి. కానీ, అదే సమయానికి తెలుగులో అనుష్క భాగమతి,  విష్ణు నటించిన ఆచారి అమెరికా యాత్రతోపాటు విశాల్ అభిమన్యుడు కూడా విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles