Not Aishwarya he is Conductor Son | ఐష్ కాదు.. కండక్టర్ కొడుకు... కేసు నమోదు

Aishwarya rai mom claim youth

Aishwarya Rai, Adireddy Sandeep Kumar, Vizag Police, Son Claim, Adireddy Sandeep Kumar, Bachchan Family

Andhra man who said 'Aishwarya Rai is my mom' may face police action. Vizag police are ready to take action against Adireddy Sandeep Kumar if Bollywood actor Aishwarya Rai Bachchan files a formal complaint charging him of tarnishing her image by claiming to be her son. However, if the person is proven medically and mentally ill, chances are very little to act against him as per the law, the police clarified.

ఐష్ కొడుకు.. అసలు కహానీ

Posted: 01/04/2018 07:00 PM IST
Aishwarya rai mom claim youth

నటి ఐశ్వర్యా రాయ్ కొడుకునంటూ ఓ యువకుడు నిన్న మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాను ఐష్ కుమారుడినని... పతాక శీర్షికలకు ఎక్కాడు. . 1988లో ఐవీఎఫ్ మెథడ్ లో తాను లండన్ లో ఐష్ కు జన్మించానంటూ సంగీత్ కుమార్ రాయ్ చెప్పేవాడు. మూడేళ్ల వరకు తన అమ్మమ్మ బ్రింగ్యారాయ్ వద్ద ఉన్నానని, ఆ తర్వాత ఏపీలోని విశాఖపట్నం జిల్లా చోడవరంలో పెరిగానని అతను చెప్పాడు. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది.

ఇప్పుడు ఆ యువకుడికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని పేరు ఆదిరెడ్డి సంగీత్ కుమార్. అతనిది చోడవరమే నంట. అయితే అతని తండ్రి ఆదిరెడ్డి మావూళ్లు ఆర్టీసీ కండక్టర్ అంట. చిన్నప్పుడు చోడవరంలో ఉన్న సంగీత్ కుమార్... ఆ తర్వాత తన తండ్రికి విశాఖకు ట్రాన్స్ ఫర్ కావడంతో అక్కడకు వెళ్లిపోయాడు. కొంతకాలం పాశ్చాత్య సంగీతంలో పాటలు పాడుతూ, యూట్యూబ్ లో వెబ్ రేడియో కూడా నడిపాడు.

గత కొంత కాలంగా బెంగుళూరులో ఉంటున్నాడని సమాచారం. కేవలం ప్రచారం కోసమే ఐశ్వర్య కొడుకునని చెప్పుకున్నాడని అంటున్నారు. విశాఖలో ఎవరితో ఇతనికి పెద్దగా పరిచయం లేదు. మరోవైపు, చోడవరంలో తాను పెరిగానంటూ ఇంటర్వ్యూల్లో చెప్పడంతో... ఇప్పుడు చోడవరంలో అందరూ సంగీత్ కోసం ఆరా తీస్తున్నారు. అయితే ఐష్ ఫ్యామిలీ చేసిన ఫిర్యాదుతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైపోతున్నారు. ఒకవేళ అతని మానసిక స్థితి నిజంగానే బాగో లేకపోతే మాత్రం అతనిపై చర్యల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles