Priyanka Chopra Produce Alia Bhatt | ప్రియాంకకు హీరోయిన్ దొరికేసింది

Alia heroine in priyanka banner

Alia Bhatt, Priyanka Chopra, Priyaka Chopra Production House, Alia Priyanka

Alia Bhatt to agree to star in Priyanka Chopra's production.

ప్రియాంక బ్యానర్ లో అలియా హీరోయిన్

Posted: 01/02/2018 05:51 PM IST
Alia heroine in priyanka banner

ప్రియాంక చోప్రా ఇప్పుడు అంతర్జాతీయ హీరోయిన్. బాలీవుడ్‌లో పెద్ద‌గా నటించేందుకు ఆసక్తి చూపటం లేదు. కానీ సినిమాల‌ను నిర్మించాల‌ని యోచిస్తోంది. అందులో భాగంగానే భార‌త్ విచ్చేసిన ప్ర‌తిసారీ త‌న సినిమాల్లో న‌టించే హీరోయిన్ల కోసం వెతుకుతోంది.

ఆ మధ్య రెండు, మూడు చిత్రాలు తీసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు. మరాఠీలో మాత్రం ఓ చిత్రం హిట్టయ్యింది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ లో ఓ చిత్రం తీసేందుకు ఆమె సిద్ధమైంది. ఆ మధ్య ఓ అవార్డుల పంక్షన్ కోసం వచ్చిన ఆమె ఓ సినిమా కథను హీరోయిన్లకు వినిపించిందంట. కానీ, వారంతా ప్రియాంక‌కి నో చెప్పేశార‌ట‌. తాను పిల్ల‌లు, వీధికుక్క‌ల క‌థాంశమే అందుకు కారణమని తెలుస్తోంది‌.

అయితే ఆ క‌థ‌ను ఆలియాభ‌ట్‌కి వివ‌రించటంతో ఆమె ఓకే చేసిందంట. స్వ‌త‌హాగా జంతువులంటే అమిత‌మైన ప్రేమ చూపించే ఆలియాభ‌ట్ అందుకే ఆసక్తి చూపిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ప్రియాంక గానీ, ఆలియా గానీ అధికారికంగా ఎలాంటి విష‌యాన్ని వెల్ల‌డించలేదు. అన్నీ కుదిరితే మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles