Sneha Disappoint with Velaikaran Success | సినిమా హిట్టు.. అయినా స్నేహ ఏడుపు.. ఎందుకు?

Sneha disappoint with scenes chopped

Actress Sneha, Velaikaran Movie, Director Mohan Raja, Velaikaran Sneha Scenes

Actress Sneha Disappoint with Velaikaran Director Mohan Raja. Director Chopped Sneha Scenes in Velaikaran.

వెలైకారన్ లో సీన్లు లేపేయటంతో స్నేహ డిసప్పాయింట్

Posted: 12/30/2017 06:14 PM IST
Sneha disappoint with scenes chopped

సౌత్ భాషల్లో కథానాయికగా స్నేహ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ మంచి మార్కులను కొట్టేసింది. అలాంటి స్నేహ రెండో ఇన్నింగ్స్ లో తన వయసుకు తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. తాజాగా ఆమె తమిళంలో 'వెలైక్కారన్' సినిమా చేసింది.

శివకార్తికేయన్ - నయనతార జంటగా నటించిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చింది. దీంతో స్నేహ తన సెకండ్ ఇన్నింగ్స్ కు సినిమా మంచి సహకారం అందిస్తుందనే భావించింది. కానీ, ఊహించని రీతిలో ఆమె షాక్ కి గురికావాల్సి వచ్చింది.

అలాంటి ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల నిడివి గల పాత్రలో స్నేహ నటించిందట. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో కష్టపడి మరీ బరువు తగ్గింది. తనకి మంచి పేరు తెస్తుందని కష్టపడి చేసిన సీన్స్ ను .. మాట మాత్రమైనా చెప్పకుండా లేపేస్తారా? అంటూ సన్నిహితుల దగ్గర స్నేహ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Velaikaran  Actress Sneha  వెలైకారన్  నటి స్నేహ  

Other Articles