Akkineni Heroes Confirm Movies in 2018 Year | నాగ్ కోపం చల్లారింది.. మరి అఖిల్ సినిమా ఎవరితో?

Nag akhil next movies confirm

Akkineni Nagarjuna, Akhil Akkineni, Director Akhil, Kalyan Krishna, Nag Akhil Next, Nagarjuna Akhil 2018 Movies, Akkineni Heroes 2018

AKkineni Nagarjuna Next Confirm with Kalyan Krishna, Akhil in Dilemma for Director's Choice. Atlee also consider for Akhil's Next.

నాగ్-అఖిల్.. తర్వాతి చిత్రాలు కన్ఫర్మ్

Posted: 12/27/2017 06:13 PM IST
Nag akhil next movies confirm

అక్కినేని హీరోలు నాగార్జున, అఖిల్ లు తమ తదుపరి చిత్రాలను ఫిక్స్ చేసేసుకున్నారు. ముఖ్యంగా 'హలో' సినిమా యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే అక్కినేని అభిమానులకు మాత్రం అది అంతగా ఆనలేదు. దీంతో మూడవ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన 3వ సినిమాకి సంబంధించిన వివరాలను జనవరి 10న వెల్లడిస్తానని అఖిల్ చెప్పాడు.

జాబితాలో కొరటాల .. బోయపాటి .. సుకుమార్ ఉండగా, తాజాగా 'మెర్సల్' దర్శకుడు అట్లీ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. అట్లీకుమార్ ఇటీవల చేసిన 'మెర్సెల్' వసూళ్ల పరంగా ఎంతగా దుమ్ము రేపేసిందో తెలిసిందే. 'హలో' సినిమాతో యూత్ కి చేరువైన అఖిల్ ను .. తదుపరి సినిమాతో మాస్ ఆడియన్స్ కి దగ్గర చేయాలనే ఉద్దేశంతో నాగ్ వున్నాడట. అందువలన ఆయన అట్లీ కుమార్ పై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే అట్లీ కుమార్ ..ప్రభాస్ ను రంగంలోకి దింపనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అఖిల్ మూడవ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తుండటం విశేషం.

నాగ్ సోగ్గాడిగానే...

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో నాగార్జున కెరియర్లోనే భారీ విజయాన్ని కల్యాణ్ కృష్ణ ఇచ్చాడు. దాంతో ఆయనపై గల నమ్మకంతో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను కల్యాణ్ కృష్ణకే ఇచ్చాడు. ఆ సినిమాను కూడా హిట్ చేసి ఆయన తన సత్తా చాటుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం మూడవ సినిమాను కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే కల్యాణ్ కృష్ణ చేయవలసి వుంది. కానీ తన మూడవ సినిమాను ఆయన రవితేజతో ప్రకటించడంతో, ఆయన ధోరణి పట్ల నాగార్జున ఫీలయ్యారని సమాచారం.

తనతో కమిట్ మెంట్ ఉండగా రవితేజతో సినిమాను కల్యాణ్ కృష్ణ ఎనౌన్స్ చేయడం నాగార్జునను కాస్త ఇబ్బంది పెట్టిందట. అది గ్రహించిన కల్యాణ్ కృష్ణ .. నాగార్జునను కలుసుకుని ఆయనను కూల్ చేశాడట. తన నాల్గొవ సినిమాను నాగ్ తో చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడని సమాచారం. బహుశా అది బంగార్రాజు అయి ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

    తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

    Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

  • Nithin to got out door location for his andhadhun remake

    ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

    Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

  • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

    తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

    Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

  • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

    ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

    Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

  • Yeleti cooking chess backdrop for nithin check

    హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

    Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh