Nayanatara Unofficially Out from Sye Raa | ప్చ్... సైరా నుంచి నయన్ తప్పుకున్నట్లేనా?

Nayan out from sye raa

Nayanatara, Sye Raa Narasimha Reddy, Chiranjeevi, Syraa Nayanatara, Director Surender Reddy

Nayanatara out from Chiranjeevi's Sye Raa Narasimha Reddy. But, Officially not yet confirmed.

సైరా నుంచి నయన్ తప్పుకున్నట్లేనా?

Posted: 12/27/2017 04:11 PM IST
Nayan out from sye raa

‘‘సైరా’’ చిరంజీవి కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో చిత్రం రూపొందుతోంది. షూటింగ్ ఆలస్యం కావటంతో ఒక్కో ప్రధాన తారాగణం సినిమా నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నయనతార నటించనుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండవ షెడ్యూల్ లో నయనతార కాంబినేషన్లోని సీన్స్ వున్నాయట. అయితే ఇంతవరకూ ఆమె తన డేట్స్ ను ఖరారు చేయడం లేదట. ఈ విషయంపై దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెతో సంప్రదించినా, ఆమె పెద్దగా రియాక్ట్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

నయనతార ఇలా ఎటూ తేల్చకుండా ఆలస్యం చేస్తుండటంతో, చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా సమస్య లేకుండగా ఉండటం కోసం మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చిత్ర పోస్టర్లు విడుదల చేసిన సమయంలో చిరుకు విషెస్ చెబుతూ నయన్ ట్వీట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నయనతార చేయడం అనుమానంగా మారటంతో ఇప్పటికిప్పుడే చిరుకు జోడీ దొరకటం కష్టమనే చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles