Sunil About Manisha Raj Childhood Memory | ఎత్తుకున్న అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది

Sunil about 2 countries heroine

Actor Sunil, 2 Countries, Manisha Raj, Sunil about Manisha Raj, Manisha Raj 2 Countries Interview

Sunil about Manisha Raj. Once in Her Childhood Sunil Met her now acted as hero besides her in Two Countries.

టూ కంట్రీస్ హీరోయిన్ గురించి సునీల్

Posted: 12/26/2017 10:11 PM IST
Sunil about 2 countries heroine

సునీల్ హీరోగా చేసిన 'టూ కంట్రీస్' సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సునీల్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సరదా సంఘటనను గురించి మాట్లాడాడు.

"ఈ సినిమా కోసం లొకేషన్లు చూడటానికి దర్శకుడు .. సినిమాటో గ్రాఫర్ యూఎస్ ఏ వెళ్లారు. అక్కడ మనీషా రాజ్ ఇంట్లో అతిథులుగా దిగారు. ఈ సినిమాలో కథానాయికకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఆమెకి ఉండటంతో, ఆమె పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారు" "మొదటి రోజు షూటింగ్ పూర్తయిన తరువాత "చాలా కాలం క్రితం మీరు మా పాపను ఎత్తుకున్నారు .. అప్పుడు మీతో మేం ఫోటో దిగాము" అని హీరోయిన్ తండ్రి అనడంతో ఆశ్చర్యపోయాను.

'సొంతం' సినిమా కోసం అప్పట్లో నేను ఫారిన్ వెళ్లాను. అప్పుడు ఓ యంగ్ కపుల్ తమ పాపను తీసుకొచ్చి నాతో ఫోటో దిగారు. ఆ అమ్మాయే ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్ అని తెలుసుకుని షాక్ అయ్యాను' అంటూ సునీల్ నవ్వాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles