Jai Simha Official Teaser Out | జై సింహా టీజర్.. బాలయ్య ఈజ్ బ్యాక్

Jai simha teaser out

Balakrishna, Jai Simha, Jai Simha Teaser, Balayya Jai Simha, KS Ravikumar, Jai Simha Teaser, Jai Simha Teaser Review

Balakrishna New Movie Jai Simha Teaser Released. Balayya Bounce Back with Revenge Drama. Nayanatara Paired Balayya in this Movie KS Ravikumar Direct the Movie.

జై సింహా టీజర్.. బాలయ్య ఈజ్ బ్యాక్

Posted: 12/21/2017 08:02 PM IST
Jai simha teaser out

టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం జై సింహా టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన బాలయ్య మరోసారి అలాంటి పవర్ ఫుల్ రోల్ లోనే కనిపించబోతున్నట్లు స్పష్టమౌతోంది.

సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని గెలికితే తల కొరికేస్తాదంటూ తన దైన శైలిలో బాలయ్య డైలాగ్ ఊపేస్తోంది. చిరంతన్ భట్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. హీరోయిన్ నయనతారను ఒక ఫ్రేమ్ లో చూపించగా.. మిగతా ఇద్దరి మాత్రం ప్రస్తావించలేదు. ఫ్లాష్ బ్యాక్.. రివెంజ్ బ్యాక్ గ్రౌండ్ తోనే చిత్రం తెరకెక్కినట్లు క్లీన్ షేవ్ తో ఉన్న బాలయ్య వేరియేషన్.. బ్యాక్ గ్రౌండ్ లోని సాంగ్ లిరిక్స్ ను బట్టి స్పష్టమౌతోంది. సంక్రాంతి కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles